AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: జోష్‌ తగ్గేదేలే.. మాస్ డ్యాన్స్‌తో దుమ్మురేపిన జేసీ ప్రభాకర్‌రెడ్డి..

వయసు మీద పడ్డా జోష్ తగ్గలేదు. తీన్మార్‌ డప్పు చప్పుళ్లు చెవిన పడగానే ఒరిజినాలిటీ బయటకొచ్చింది. రోడ్డుపైనే చిందేశారు. చుట్టూ ఉన్నవాళ్లకు తనలోని కళను పరిచయం చేశారు.

Andhra Pradesh: జోష్‌ తగ్గేదేలే.. మాస్ డ్యాన్స్‌తో దుమ్మురేపిన జేసీ ప్రభాకర్‌రెడ్డి..
Jc Prabhakar Reddy Dance
Shiva Prajapati
|

Updated on: Apr 11, 2023 | 11:43 AM

Share

వయసు మీద పడ్డా జోష్ తగ్గలేదు. తీన్మార్‌ డప్పు చప్పుళ్లు చెవిన పడగానే ఒరిజినాలిటీ బయటకొచ్చింది. రోడ్డుపైనే చిందేశారు. చుట్టూ ఉన్నవాళ్లకు తనలోని కళను పరిచయం చేశారు. వెయ్‌ చిందేయ్‌ అని డ్యాన్స్‌ చేస్తోన్న ఆయన ఎవరో కాదు.. భవిరి గడ్డంతో నెత్తిన తలపాగా చుట్టి.. చేతులు అటూ ఇటూ ఊపుతూ.. డ్యాన్స్‌ జర్క్‌లు ఇస్తున్న ఈయనే. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి. ప్రస్తుతం తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌. టీడీపీ నేత నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర తాడిపత్రి చేరుకోవడంతో.. అనుచరులతో కలిసి ఇలా కనిపించారు జేసీ.

ఏదో పాదయాత్రలో పాల్గొని సరిపెట్టకుండా.. పాదయాత్రలో లోకేష్‌కు చేరువలో నడిస్తే ఉపయోగం లేదని అనుకున్నారో ఏమో.. జనాల అటెన్షన్‌ కోసం డప్పులు వాయించే కళాకారుల దగ్గరకు చేరుకున్నారు జేసీ. కెమెరా ఫోకస్‌ తనపై పడేలా ఇలా సీమ స్టయిల్లో చిందేశారు ఈ మాజీ ఎమ్మెల్యే. వయసు మీద పడినా.. తనలో అదే జోష్ తగ్గలేదని నిరూపించారు ప్రభాకర్‌రెడ్డి.

ఈ జోష్ ఇలా ఉంటే.. తాడిపత్రి నియోజకవర్గంలో యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ను కలిశారు తాడిపత్రి డీఎస్పీ చైతన్య. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని నారా లోకేష్ కు పోలీసులు నోటీసులు అందించారు. 149 సీఆర్పీసీ కింద ఈ నోటీసులు అందజేశారు. ‘తాడిపత్రి నియోజకవర్గం ఫ్యాక్షన్ నేపద్యం ఉన్న ప్రాంతం.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు’ అని నోటీసులో తెలిపిన పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..