Vemuru Politics: దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు సిద్ధమా..? మంత్రి నాగార్జునకు మాజీ మంత్రి ఆనందబాబు సవాల్.. 

సబ్జెక్ట్ ఏదైనా సరే, సెంటర్ ఏదైనా సరే. టైమ్ నువ్వు చెప్పినా సరే.. నన్ను చెప్పమన్నా సరే, ఒక్కడివే వచ్చినా సరే, వందమందితో వచ్చినా సరే.. రా చూస్కుందాం. చర్చించుకుందాం. ఇది సినిమా డైలాగ్ కాదు. బాపట్ల జిల్లాలో మంత్రి మేరుగ, మాజీ మంత్రి నక్కా మధ్య పొలిటికల్ సవాళ్లు.. !

Vemuru Politics: దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు సిద్ధమా..? మంత్రి నాగార్జునకు మాజీ మంత్రి ఆనందబాబు సవాల్.. 
Ap Politics
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 11, 2023 | 8:49 AM

ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. ఎన్నికల టైం దగ్గర పడుతున్న కొద్ది నియోజకవర్గాల్లో అధికార, ప్రతిపక్ష నేతలు ఒకరిపై ఒకరు మాటల తూటలు పేలుస్తున్నారు. గతంలో జరిగిన దానికి ప్రజెంట్ జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమంపై చర్చకు రావాలంటూ సవాళ్లు విసురుకుంటున్నారు. తాజాగా బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో సవాళ్ల పరవం తారాస్థాయికి చేరింది. మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు సవాల్ కు ప్రతి సవాల్ విసిరారు మంత్రి మేరుగ నాగార్జున టైం, డేట్ ఫిక్స్ చేసి చెప్పు చర్చిద్దామన్నారు.

మాజీ మంత్రి, మంత్రి మధ్య సవాళ్ల పర్వంతో పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. దమ్ము ధైర్యం ఉంటే మంత్రి మేరుగ నాగార్జున చర్చకి రావాలని నక్కా ఆనంద్ బాబు సవాల్ విసిరారు. హడావుడి లేకుండా మనమిద్దరమే మీడియా సమక్షంలో చర్చిద్దామన్నారు. పోలీసుల్ని పెట్టి షో చేయకుండా నిజంగా చర్చకు రావాలన్నారు. దళితులకు చేసిన మోసం.. మైనార్టీలకు చేసిన మోసం.. ఇంకా ఏమేమి హామీలు ఇచ్చారో వాటిలో ఎలాంటి మోసం చేశారో చర్చకు సిద్ధమన్నారు. హడావుడి ఏమీ లేకుండా మనమిద్దరమే కూర్చుందాం కార్యకర్తలు కూడా వద్దు మీడియా సమక్షంలో చర్చిద్దామంటూ సూచించారు. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్స్ గా ఇద్దరం చేసాం.. దానిపై చర్చకి రావాలని సవాల్ చేశారు. పల్లెల్లో చేసిన అభివృద్ధి పైన చర్చకు వస్తావా.. ఏదైనా సరే .. సబ్జెక్టు వైస్ గా చర్చిద్దామన్నారు. మీరు, మేము చేసిన దోపిడీ మీద చర్చిద్దామా..? అంటూ సవాల్ విసిరారు.

నక్కా ఆనంద్ బాబు వ్యాఖ్యలపై మంత్రి మేరుగ నాగార్జున స్పందించారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు చాలా ఎక్కువ మాట్లాడారు.. ఆయన ఛాలెంజ్ కి నేను సిద్ధం అంటూ మేరుగ నాగార్జున పేర్కొన్నారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధికి కానీ సంక్షేమ పథకాల విషయంలో కానీ దేనికైనా బహిరంగ చర్చకు సిద్దమని స్పష్టంచేశారు. ఒక్కడివే వచ్చినా సరే చంద్రబాబు కొడుకుని తెచ్చుకున్న సరే.. నియోజకవర్గంలో నక్కా ఆనంద్ బాబు చెప్పిన సమయానికి ఒక్కడినే వస్తానన్నారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధికైనా..? రాష్ట్రంలో జరిగిన అభివృద్ధికైనా..? దేనికైనా చర్చకి సిద్ధమే అంటూ మంత్రి మేరుగ నాగార్జున.. నక్కా ఆనంద్ బాబుకు సవాల్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..