Chittoor District: దొంగతనం చేసి పట్టుబడ్డ ఏఎస్‌ఐ గుండెపోటుతో మృతి
చిత్తూరు జిల్లాలో రిమాండ్ ఖైదీగా ఉన్న సస్పెండెడ్ ఏఎస్ఐ మహమ్మద్ మృతి చెందారు. ఈ నెల 4న రోడ్ సైడ్ బట్టల దుకాణంలో దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా మరో కానిస్టేబుల్‌తో పాటు...
చిత్తూరు జిల్లాలో రిమాండ్ ఖైదీగా ఉన్న సస్పెండెడ్ ఏఎస్ఐ మహమ్మద్ మృతి చెందారు. ఈ నెల 4న రోడ్ సైడ్ బట్టల దుకాణంలో దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా మరో కానిస్టేబుల్‌తో పాటు దొరికిన కేసులో ఏఎస్ఐ అరెస్టయ్యారు. ఎస్పీ అదేశాల మేరకు దొంగతనం కేసులో ఇరువురిని సస్పెండ్ చేసి, చిత్తూరు జిల్లా జైలులో రిమాండ్‌కు తరలించారు. కాగా బుధవారం జైలులో మహమ్మద్‌కు గుండెపోటు రావడంతో జైలు అధికారులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహమ్మద్ మృతి చెందారు.
అసలేం జరిగిందంటే…
దొంగల అవతారమెత్తిన పోలీసులు కొద్ది రోజుల క్రితం కలెక్టరేట్ రోడ్ లోని ఒక ఒమిని వ్యాన్ వద్ద ఉంచిన బట్టల్ని దొంగలిస్తూ నిఘా కంటికి అడ్డంగా దొరికిపోయాడు. దీన్ని గోప్యంగా ఉంచేందుకు కొందరు ప్రయత్నం చేసినా వ్యాపారి ఫిర్యాదు చేయడానికి వెనకాడకపోవడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. ఓ వ్యక్తి పీవీకేఎన్ కళాశాల నుంచి కలెక్టరేట్ కు వెళ్లే మార్గంలో ఒమిని వ్యానులో దుస్తుల వ్యాపారాన్ని ప్రారంభించాడు. రోజూ పని ముగించుకున్న అనంతరం.. దుస్తులు అన్నీ మూటగట్టి.. తాడుతో కట్టి వెళ్లేవాడు. అదే విధంగా ఇటీవల రాత్రివేళ దుస్తులు మూట గట్టి వెళ్లి మరుసటిరోజు వచ్చి చూసేసరికి స్టాక్ తక్కువగా ఉందని అనిపించింది. ఆయన ముందు చూపుతో ఎవరికీ తెలియకుండా అమర్చిన సీసీ కెమెరా దొంగలుగా మారిన కానిస్టేబుల్‌ను, ఏఎస్‌ఐను పట్టించింది. సీసీ ఫుటేజీని చూడటంతో చోరీ చేసిన వ్యక్తి యూనిఫాంలో ఉన్న కానిస్టేబుల్ అని వెల్లడైంది. అతనితో పాటు సివిల్ డ్రెస్‌లో ఏఎస్‌ఐ కూడా అక్కడే ఉండి.. ఈ దొంగతనంలో పాలుపంచుకున్నారు. ఆపై ధైర్యంతో ఆ ఫుటేజీని పోలీసులకు ఇచ్చి ఫిర్యాదు చేయడంతో దొంగలుగా మారిన పోలీసులు దొరికిపోయాడు. ద్విచక్ర వాహనంలో వచ్చినవారిలో ఒకరు కానిస్టేబుల్ కాగా, సాధారణ దుస్తుల్లో మరో వ్యక్తి ఏఎస్ఐ మహమ్మద్‌గా గుర్తించి.. సస్పెండ్ చేశారు.
Also Read: ప్రజంట్ టాలీవుడ్‌లో దూసుకుపోతున్న ఓ నటే.. ఈ ఫోటోలోని చిన్నారి.. ఎవరో గుర్తించగలరా…?