YS Viveka murder case: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. అతడి అరెస్టుకు రంగం సిద్దం..!
వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. హత్య ఎలా జరిగిందో తాజాగా కల్పిత పాత్రలతో సీబీఐ అధికారులు వీడియో షూట్ చేశారు. ఈ క్రమంలో మరో అరెస్ట్‌కు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది.
వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. వివేకానందరెడ్డి ప్రధాన అనుచరుడు, చాలాకాలం ఆయన్ను వెన్నంటే ఉన్న ఎర్ర గంగిరెడ్డిని… సీబీఐ అధికారులు అరెస్టు చేయనున్నట్లు సమాచారం. వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డిని ఇప్పటికే అరెస్టు చేయగా.. మూడో నిందితుడిగా ఎర్ర గంగిరెడ్డిని అరెస్టు చేసే చాన్స్ ఉంది. బుధవారం మధ్యాహ్నం గంగిరెడ్డిని పులివెందుల నుంచి కడపకు తీసుకొచ్చారు. సాయంత్రం 5 గంటల వరకూ విచారించి… ఆ తర్వాత కడప రిమ్స్‌కు తీసుకెళ్లి కరోనా సహా, ఇతర వైద్య పరీక్షలు చేయించారు. గురువారం పులివెందుల కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బుధవారం కూడా వివేకా ఇంట్లో సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ చేసిన సీబీఐ అధికారులు.. ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి ఎలా ఇంట్లోకి ప్రవేశించారు, ఎక్కడెక్కడ దాక్కున్నారు, గేటు తీసుకొని ఎలా వెళ్లారు, బైక్‌పై ఎవరెవరు వచ్చారు, హత్య జరిగిన తర్వాత ఎలా ఎస్కేప్ అయ్యారు వివరాలను పరిశీలించారు. హత్య ఎలా జరిగిందో కల్పిత పాత్రలతో సీబీఐ అధికారులు వీడియో షూట్ చేశారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ సమయంలో ఇంట్లో ఉన్న వివేకా కుమార్తె సునీతతో అధికారులు గంట పాటు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసులో నిందితుల పాత్రపై చర్చినట్లు తెలుస్తోంది.
2019 మార్చి 14న ఎన్నికల ప్రచారం ముగించుకుని రాత్రి 11 గంటల 30 నిమిషాలకు ఇంటికి చేరుకున్న వివేకా.. మార్చి 15 తెల్లవారుజామున దారుణ హత్యకు గురయ్యారు. వివేకా ఇంటికి వచ్చినపుడు కారులో ఆయనతోపాటు ఎర్ర గంగిరెడ్డి మాత్రమే ఉన్నారు. ఆ తర్వాత గంగిరెడ్డిని ఆయన ఇంటి వద్ద దిగబెట్టి… వివేకా తన ఇంటికి వచ్చారు. అర్ధరాత్రి దాటాక తర్వాత నలుగురు వ్యక్తులు వివేకా ఇంట్లోకి చొరబడి ఉంటారని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. వారిలో ఎర్ర గంగిరెడ్డి పాత్ర కూడా ఉన్నారని సీబీఐ ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. హత్య జరిగిన రోజు ఇంట్లో సాక్ష్యాధారాలు చెరిపేశారనే అభియోగాలపై 2019 మార్చి 28నే సిట్ అధికారులు గంగిరెడ్డిని అరెస్టు చేశారు. అప్పట్లో 90 రోజుల పాటు జైల్లో ఉన్న గంగిరెడ్డి… ఆ తర్వాత బెయిల్‌పై బయటికొచ్చారు. ఇప్పుడు 302 సెక్షన్ కింద మరోసారి అరెస్టు చేయనున్నట్లు తెలుస్తోంది.
Also Read: పోర్న్ చూస్తున్నారా..? అయితే ఈ షాకింగ్ న్యూస్ మీ కోసమే..