AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyber Crime Police: పోర్న్ చూస్తున్నారా..? అయితే ఈ షాకింగ్ న్యూస్ మీ కోసమే..

ఇంటర్నెట్‌ వినియోగం పెరగటంతోపాటు, సెల్‌ఫోన్ల వల్ల పోర్న్ వ్యాప్తి రోజురోజుకు విస్తరిస్తుంది. పోర్న్ ప్రభావంతో మృగాళ్లు రెచ్చిపోతున్నారు. చైల్డ్ పోర్నోగ్రఫీ చూసేవారి సంఖ్య కూడా ప్రమాదకరంగా పెరుగుతోంది. దీంతో పోలీస్ వ్యవస్థ ఈ ఇష్యూపై ఫోకస్ పెట్టింది.

Cyber Crime Police: పోర్న్ చూస్తున్నారా..? అయితే ఈ షాకింగ్ న్యూస్ మీ కోసమే..
Crime News
Ram Naramaneni
|

Updated on: Sep 16, 2021 | 1:00 PM

Share

ఇప్పుడు పోర్న్ ఎంత విచ్చలవిడిగా పెరిగిందో అందరికి తెలిసిందే. ఇంటర్నెట్‌ వినియోగం పెరగటంతోపాటు, సెల్‌ఫోన్ల వల్ల దీని వ్యాప్తి రోజురోజుకు విస్తరిస్తుంది. పోర్న్ ప్రభావంతో మృగాళ్లు రెచ్చిపోతున్నారు. వావి వరసలు మరిచి, చిన్నపిల్లలన్న ఇంగితం కూడా లేకుండా లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా చైల్డ్ పోర్నోగ్రఫీ చూసిన 16మందిపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసులు నమోదు చేశారు. సీఐడి విభాగానికి 16మందికి సంబంధించిన లింక్స్‌ను ఎన్‌సీఆర్‌సీ(నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో) సెండ్ చేసింది. దీంతో చైల్డ్ పోర్నోగ్రఫీ చూసిన 16మంది ఐపీ అడ్రెస్‌లను సేకరించి సీసీఎస్‌లో సీఐడీ కంప్లైంట్ చేసింది. సీఐడి ఫిర్యాదుతో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. చైల్డ్ పోర్నోగ్రఫీ చూసే వ్యక్తుల పాలిట అమెరికన్ ఏజెన్సీ సింహస్వప్నంగా మారింది. ఇండియాలో చైల్డ్ పోర్నోగ్రఫీ చూస్తే  విదేశీ ఏజెన్సీ ఇట్టే పసిగట్టేస్తుంది.  ఐ.పి అడ్రెస్ ఆధారంగా వివరాలు సేకరించి సదరు విదేశీ సంస్థ ఎన్.సి.ఆర్.బికి వివరాలు పంపుతోంది. ఆ వివరాలను సంబందిత రాష్ట్రాల సైబర్ క్రైమ్ పోలీసులకు ఎన్.సి.ఆర్.బికి అంజేస్తుంది. ఈ వివరాలతో కేసులు నమోదు చేసి సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగుతున్నారు. టిప్ లైన్ అనే ఈ-సిస్టమ్ ద్వారా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు  16మంది వివరాలు అందాయి. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలుపెట్టారు.

మరోవైపు  చైల్డ్ పోర్నోగ్రఫీని అరికట్టేందుకు… బాలలపై లైంగిక దాడుల నివారణ, దర్యాప్తు విభాగం-ఓసీఎస్​ఏఈ పేరిట ఢిల్లీలో సెపరేట్ వ్యవస్థను, టీమ్‌ను స్థాపించింది. సీబీఐ స్పెషల్ క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్ వింగ్ పరిధిలో ఓసీఎస్​ఏఈ పనిచేయనుంది. ఈ స్పెషల్ టీం.. చిన్నపిల్లలతో కూడిన నీలి చిత్రాలను అప్‌లోడ్ చేస్తోన్న, వాటిని చూస్తోన్న వారిపై  కేసులు పెట్టి ..బెండు తీయనుంది. వారిపై  ఇండియన్ పీనల్ కోడ్‌తో పాటు.. పోక్సో చట్టం, ఐటీ యాక్ట్ (2000) కింద  కేసులు నమోదు చెయ్యనుంది.

ఇటీవల కాలంలో మహిళలతో పాటు చిన్నారులపై కూడా లైంగిక దాడులు పెరిగాయి. తాజాగా సైదాబాద్ లో ఆరేళ్ళ చిన్నారిని అతి దారుణంగా అత్యాచారం చేసి చంపేసిన ఘటన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చైల్ట్ ఫోర్నోగ్రఫీ అంశం మరోసారి చర్చల్లోకి వచ్చింది. చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్ క్రియేట్ చేసేవారిని, చూసేవారిని, షేర్ చేసేవారిని కఠినంగా శిక్షించాలని పలువురు కోరుతున్నారు.

Also Read: ఆన్లైన్ ఎడ్యుకేషన్ సెంటర్‌గా మారిన స్మశానం.. బ్రతుకులు ముగిసే చోట అతడు జీవితాన్ని వెతుక్కుంటున్నాడు

నిందితుడు రాజు ఆచూకి కోసం ఆ ప్రాంతంపై పోలీసుల స్పెషల్ ఫోకస్.. ప్రతి వీధిలోనూ తనిఖీ