Saidabad Rape Case: నిందితుడు రాజు ఆచూకి కోసం ఆ ప్రాంతంపై పోలీసుల స్పెషల్ ఫోకస్.. ప్రతి వీధిలోనూ తనిఖీ

సింగరేణి కాలనీ హత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్​ విచారం వ్యక్తం చేసినట్లు హోంమంత్రి మహమూద్అలీ తెలిపారు. డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ సహా పోలీసు ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

Saidabad Rape Case: నిందితుడు రాజు ఆచూకి కోసం ఆ ప్రాంతంపై పోలీసుల స్పెషల్ ఫోకస్.. ప్రతి వీధిలోనూ తనిఖీ
Saidabad Rape Accused
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 16, 2021 | 8:22 AM

సింగరేణికాలనీ నిందితుడు ఎక్కడ..? అతనికోసం సుమారు వందలాది మంది పోలీసులు గాలిస్తున్నారు. నల్లగొండ ఉమ్మడిజిల్లాలోని హైవేలపై పోలీసులు నిఘా పెంచారు. తెలంగాణ- ఆంధ్రా సరిహద్దులో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆంధ్రా నుంచి వచ్చే ప్రయాణికులకు అత్యాచార నిందితుడి ఫొటోను చూపి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు పోలీసులు. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి హతమార్చిన రాజు సొంతూరు జనగామజిల్లా కొడకండ్ల మండల కేంద్రం. రాజు పుట్టకముందే జీవనోపాధి కోసం అతని కుటుంబం హైదరాబాద్‌ వచ్చింది. రాజు సొంతూరులోనే తలదాచుకుని ఉండవచ్చని కొడకండ్లపై నిఘాపెట్టారు పోలీసులు. నిందితుడి ఆచూకీ కోసం ఆ ప్రాంతంలో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. అతని ఫోటో చూపిస్తూ ..రివార్డు విషయాన్ని గుర్తు చేస్తూ సెర్చ్‌ చేస్తున్నారు పోలీసులు. ఆటోలు, రైళ్లు, బస్సులు ఇలా ప్రతి చోట.. 24 గంటల పాటు మూడు కమిషనరేట్ల పరిధిలోని వెయ్యి మందికిపైగా పోలీసులు గాలిస్తున్నారు. అయినా… ఇప్పటి వరకు ఎలాంటి ఫలితం లేదు. కాగా ఈ కేసును నేరుగా డీజీపీ మహేందర్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఎల్​బీనగర్, ఉప్పల్ ప్రాంతాల్లో నిందితుడు సంచరిస్తున్నాడనే ఉద్దేశంతో.. రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్​ను అప్రమత్తం చేశారు. సైబరాబాద్ ఎస్​వోటీ పోలీసులు సైతం రంగంలోకి దిగారు. ప్రధాన రహదారులు, వీధులతో పాటు కాలనీల్లోని సీసీ కెమెరాలను చెక్ చేస్తున్నారు.

నిందితుడు రాజుపై గతంలోనూ చైతన్యపురి పోలీస్​స్టేషన్​లో కేసు నమోదైంది. ఆటోను దొంగిలించిన కేసులో గతేడాది అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. అనంతరం బెయిల్​పై బయటకు వచ్చాడు. రాజుకు తండ్రి లేకపోవడంతో, తల్లి కూలీ పనులు చేస్తూ కొడుకును పోషించింది. కేవలం 3వ తరగతి వరకే చదివిన రాజు ఎక్కువగా హైదరాబాద్​లోనే ఉంటాడని పోలీసుల దర్యాప్తులో స్పష్టమైంది. అప్పుడప్పుడు సొంత గ్రామమైన జనగామ జిల్లా కడకొండ్లకు వెళ్లొస్తుంటాడని చుట్టుపక్కల వారు పోలీసులకు తెలిపారు. లేబర్ అడ్డాల్లోనూ రాజు ఒకరిద్దరితోనే మాట్లాడతాడని… వాళ్లతో కలిసి కూలీ పనిచేయగా వచ్చే సొమ్మును పంచుకుంటారని పోలీసుల దర్యాప్తులో తెలిసింది. రాష్ట్రంలోని ప్రతి పోలీస్ స్టేషన్‌కు నిందితుడికి సంబంధించిన సమాచారం వెళ్లింది.

Also Read: గుండె పోటుతో భర్త మృతి అంటూ సీన్ క్రియేట్ చేసింది.. కానీ అసలు విషయం బయటపెట్టిన కొడుకు.. షాకైన పోలీసులు