AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మందలించినందుకు మర్డర్ చేశారు.. పూర్తి వివరాలు..

ఎవరైనా అల్లరి చేస్తే నచ్చ చెప్పడం మన బాధ్యత. ఇంట్లో వాళ్ళైతే మాట వినకపోతే ఓ దెబ్బ కొడతాం. బయట వారైతే మందలించి సత్ప్రవర్తనతో ఉండాలని సూచిస్తాము. కానీ అలా మందలించవడమే ఆయన చేసిన పాపం. కక్ష పెంచుకున్న ఆ కుర్రాళ్ళు.. దారుణానికి ఒడిగట్టారు. బుద్ధిగా చదువుకోమన్నందుకు నిప్పు పెట్టి చంపేశారు.

మందలించినందుకు మర్డర్ చేశారు.. పూర్తి వివరాలు..
Supervisor Dies
Maqdood Husain Khaja
| Edited By: Srikar T|

Updated on: Apr 05, 2024 | 5:06 PM

Share

ఎవరైనా అల్లరి చేస్తే నచ్చ చెప్పడం మన బాధ్యత. ఇంట్లో వాళ్ళైతే మాట వినకపోతే ఓ దెబ్బ కొడతాం. బయట వారైతే మందలించి సత్ప్రవర్తనతో ఉండాలని సూచిస్తాము. కానీ అలా మందలించవడమే ఆయన చేసిన పాపం. కక్ష పెంచుకున్న ఆ కుర్రాళ్ళు.. దారుణానికి ఒడిగట్టారు. బుద్ధిగా చదువుకోమన్నందుకు నిప్పు పెట్టి చంపేశారు. విశాఖలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పార్వతీపురం మన్యం జిల్లా బత్తిలి గ్రామానికి చెందిన చెప్పలా నాగభూషణం అలియాస్ జాన్ ఉపాధి కోసం విశాఖ వచ్చాడు. 15 ఏళ్ల క్రితం నుంచి చేపలు ఉప్పాడ ప్రాంతంలో నివాసం ఉండేవాడు. ఆ తర్వాత భార్య ఇద్దరు కుమారులతో కలిసి చిన్న ఉప్పాడలో నివసిస్తున్నారు.

వారికి కౌన్సిలింగ్..

అయితే.. అదే ప్రాంతంలో ఓ కాంట్రాక్టర్ వద్ద సూపర్వైజర్‎గా పని చేస్తున్నాడు నాగభూషణం. విద్యావంతుడైన జాన్ భీమిలిలోని ఓ ప్రైవేట్ టెక్నికల్ ఇన్‎స్టిట్యూట్‎లో పార్ట్ టైం ట్యూటర్‎గా పనిచేస్తున్నాడు. భార్య కూడా ఓ సిమెంట్ దుకాణంలో క్లర్క్‎గా పని చేస్తుంది. నాగభూషణం కుటుంబానికి ఆ ప్రాంతంలో మంచి పేరు ఉంది. అయితే చిన్న ఉప్పాడలో నాగభూషణం ఉండే పరిసర ప్రాంతాల్లో ఉండే ఇద్దరు మైనర్లు, రాజు అనే యువకుడు స్నేహితులు. ఆ ప్రాంతంలో జులాయిగా తిరుగుతూ ఆకతాయి పనులు చేయడంతో.. ఆ ముగ్గురు గురించి స్థానికులు జాన్ కు చెప్పారు. దీంతో ఒకరోజు జాన్.. ఆ ముగ్గురిని పిలిచి కౌన్సిలింగ్ చేశారు. నాలుగు మంచి మాటలు చెప్పి బుద్ధిగా చదువుకొని, సంస్కారంతో ఉండాలని సూచించారు. కాస్త మందలించి అందరితో సక్రమంగా మెలగాలని చెప్పాడు నాగభూషణం.

టిన్నర్ పోసి.. నిప్పు పెట్టి..

అక్కడ నుంచి వచ్చేసిన గరికిన రాజు సహా ఆ ముగ్గురు.. నాగభూషణంపై కక్ష పెంచుకున్నారు. గత నెల 29న అర్ధరాత్రి ఇంటికి వచ్చి.. జాన్‎ను పిలిచారు. బయటకు వచ్చి చూసిన జాన్‎పై అప్పటికే సిద్ధం చేసుకున్న టిన్నర్ (పెయింట్‎లో కలిపే ద్రావణం)ను పోశారు. నిప్పు పెట్టి పారిపోయారు. మంటల్లో ఉన్న నాగభూషణం కేకలు పెట్టేసరికి కుటుంబ సభ్యులు, స్థానికులు మంటలను ఆర్పి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నాలుగు రోజుల తర్వాత నాగభూషణం ప్రాణాలు కోల్పోయాడని అన్నారు సిఐ రమేష్. పోలీసులు మృతుడి మరణ వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. గాయపడగానే నమోదైన ఎఫ్ఐఆర్‎ను హత్య కేసుగా మార్చారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇద్దరు నిందితులను మైనర్ల హోమ్ కు పంపి.. రాజు‎ను అరెస్ట్ చేసి జైల్లో కూర్చోబెట్టారు. చూశారుగా.. కేవలం బుద్ధిగా ఉండాలని సూచించడమే నాగభూషణం చేసిన తప్పు. మంచి చేయాలనుకున్న నాగభూషణం.. చివరకు వాళ్ల చేతిలో హత్యాయత్నానికి గురై ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. నాగభూషణం మరణంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఇటువంటి ఘటనలు చూస్తుంటే సమాజం ఎక్కడికి పోతుంది అన్న ఆందోళన స్థానికల్లో మొదలైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..