AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Temperature: చుక్కలు చూపిస్తున్న సూర్యుడు.. నిప్పుల కుంపటిలా తెలుగు రాష్ట్రాలు

తెలుగు రాష్ట్రాల్లో భానుడు (Sun) విశ్వరూపం చూపిస్తు్న్నాడు. వేసవి ఆరంభంలోనే భగభగమంటూ చెమటలు కక్కిస్తున్నాడు. ఉదయం నుంచే ఎండ, ఉక్కపోతకు తోడు మధ్యాహ్నం సమయంలో వడ గాలులు వేడి పుట్టిస్తున్నాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి...

Summer Temperature: చుక్కలు చూపిస్తున్న సూర్యుడు.. నిప్పుల కుంపటిలా తెలుగు రాష్ట్రాలు
Summer Tips
Ganesh Mudavath
|

Updated on: Mar 30, 2022 | 5:09 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో భానుడు (Sun) విశ్వరూపం చూపిస్తు్న్నాడు. వేసవి ఆరంభంలోనే భగభగమంటూ చెమటలు కక్కిస్తున్నాడు. ఉదయం నుంచే ఎండ, ఉక్కపోతకు తోడు మధ్యాహ్నం సమయంలో వడ గాలులు వేడి పుట్టిస్తున్నాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు (Temperature) పెరగడంతో ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో ఏపీలో పలు ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని కొన్నిచోట్ల ఇవాళ కూడా వడగాలులు వీచే అవకాశం ఉందని తాజా ప్రకటనలో పేర్కొంది. విజయనగరం జిల్లా కొమరాడ, కురుపాం, పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం, గరుగుబిల్లి మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని ప్రకటించింది. తెలంగాణలోనూ పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లా చాప్రాలలో 43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గత పదేళ్ల మార్చి ఉష్ణోగ్రతల్లో ఇది కొత్త రికార్డ్‌. ఎల్లుండి వరకు రాష్ట్రంలో సాధారణం కన్నా 3 డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.

విదర్భ నుంచి కేరళ వరకూ గాలులతో ఉపరితల ద్రోణి 900 మీటర్ల ఎత్తున కొనసాగుతోంది. దీంతో ఎండల తీవ్రత పెరుగుతోంది. ఎండవేడి కారణంగా నల్గొండ ప్రాంతంలో గాలిలో తేమ సాధారణం కన్నా 24 శాతం తక్కువై పొడి వాతావరణం ఏర్పడింది. ఎండ తీవ్రతతో ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వడగాల్పులతో ఇబ్బందులు పడుతున్నారు. ఏప్రిల్‌, మే నెలల్లో 44 నుంచి 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పెరగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రజలు ఎండలో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

Also Read

KTR: మినిస్టర్ కేటీఆర్‌ పక్కన కిర్రాక్ లుక్‌తో ఉన్న ఈ కుర్రోడు ఎవరో గుర్తుపట్టగలరా..?

Coral Reefs: మనుషుల శవాలతో సముద్రం అడుగున పగడపు దిబ్బల ఏర్పాటు.. కాన్సెప్ట్ సూపర్ అంటున్న నెటిజన్లు

Tribal Reservations: గిరిజన రిజర్వేషన్ల పేరుతో మరోసారి మోసానికి ప్రయత్నిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ః మంత్రి సత్యవతి రాథోడ్

శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..