Ugadi Special Trains: రైల్వే ప్రయాణికులకు అలెర్ట్.. ఉగాది సందర్భంగా ప్రత్యేక రైళ్లు..
Ugadi Special Trains: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణికుల రద్దీని పరిగణలోకి తీసుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల నుంచి మొత్తం ఆరు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి
Ugadi Special Trains: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణికుల రద్దీని పరిగణలోకి తీసుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల నుంచి మొత్తం ఆరు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. రేపటి (మార్చి31) నుంచి ఏప్రిల్ 4 వరకు ఈ రైళ్లు నడవనున్నాయి. వీటికి సంబంధించి దక్షిణ మధ్య రైల్వే బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం మార్చి 31న కాకినాడ, సికింద్రాబాద్ నగరాల మధ్య ప్రత్యేక రైళ్లు (07953/07954) నడవనున్నాయి. మార్చి 31న రాత్రి 8.45 గంటలకు కాకినాడ స్టేషన్ నుంచి 07953 ట్రైన్ బయలుదేరుతుంది. సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, రాయనపాడు, కొండపల్లి, ఖమ్మం, వరంగల్, ఖాజిపేట స్టేషన్ల మీదుగా మరుసటి రోజు (ఏప్రిల్1) ఉదయం 7.10 గంటలకు సికింద్రా బాద్ చేరుతుంది. అదేరోజు రాత్రి 07954 నంబర్ గల స్పెషల్ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు 8.40 గంటలకు కాకినాడ చేరుతుంది.
తిరుపతి- సికింద్రాబాద్ ల మధ్య..
ఏప్రిల్ 2న 07595 నంబరు గల స్పెషల్ సర్వీసు కాకినాడ నుంచి బయలుదేరి సామర్ల కోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడురు, రేణిగుంట స్టేషన్ల మీదుగా మరుసటి రోజు తిరుపతికి చేరుకుంటుంది. ఇక ఏప్రిల్3 న రాత్రి 7.50 గంటలకు 07596 నంబర్ గల స్పెషల్ ట్రైన్ తిరుపతి నుంచి బయలు దేరి మరుసటి రోజు ఉదయానికి సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. ఇది రేణిగుంట, గూడురు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతుంది. అదేవిధంగా 3,4 తేదీల్లో గుంటూరు- హుబ్బలి మధ్య రెండ ప్రత్యేక రైళ్లు (07591/07532) ప్రత్యేక సర్వీసులు నడవనున్నాయి. ఏప్రిల్ 3న సాయంత్రం 4.30 గంటలకు 07591 నంబరు గల రైలు గుంటూరు నుంచి బయలు దేరుతుంది. నర్సారావు పేట, వినుకొండ, దొనకొండ, మార్కాపూర్ రోడ్, గిద్దలూరు, నంద్యాల, డోన్, గుంతకల్, బళ్లారి, హోస్పేట, మునీరాబాద్, కొప్పల్, గదగ్ స్టేషన్ల మీదుగా ఉదయం 7. 10 గంటలకు హుబ్బలి చేరుకుంటుంది. ఇక అదే రోజు ఉదయం 9.25 గంటలకు 07592 గల రైలు హుబ్బలి నుంచి బయలుదేరి రాత్రి 12.30 గంటలకు గుంటూరు చేరుకుంటుంది.
Six #Ugadi Festival Special Trains between various destinations @drmsecunderabad @drmhyb @drmgnt @drmgtl @drmvijayawada @VijayawadaSCR pic.twitter.com/mMgaKIpjuJ
— South Central Railway (@SCRailwayIndia) March 30, 2022
Also Read:Summer Temperature: చుక్కలు చూపిస్తున్న సూర్యుడు.. నిప్పుల కుంపటిలా తెలుగు రాష్ట్రాలు
Nithin: నితిన్ బర్త్‌డే స్పెషల్.. మాచర్ల నియోజకవర్గం నుంచి ఫస్ట్ ‘అటాక్’ వచ్చేసింది..