KTR: మినిస్టర్ కేటీఆర్ పక్కన కిర్రాక్ లుక్‌తో ఉన్న ఈ కుర్రోడు ఎవరో గుర్తుపట్టగలరా..?
తెలంగాణకు భారీ పెట్టుబడులే లక్ష్యంగా 12 రోజులపాటు అమెరికాలో పర్యటించిన మంత్రి కేటీఆర్ (Minister KTR) హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడ వివిధ కంపెనీల అధిపతులతో చర్చలు జరిపారు.
Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(CM Kcr) తనయుడు కేటీఆర్(Ktr) అటు ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తూనే, పార్టీ బలోపేతానికి నిత్యం కృషి చేస్తున్నారు. కేసీఆర్ కుమార్తె కవిత(Kalvakuntla Kavitha) ఎమ్మెల్సీగా మండలిలో పార్టీ వాయిస్ వినిపిస్తున్నారు. ఇరువురు కూడా టీఆర్‌ఎస్(Trs) క్యాడర్‌కు ఎప్పటికప్పుడు బూస్ట్ ఇస్తూ ముందుకు సాగుతున్నారు. తండ్రి కేసీఆర్ లాగానే ఇరువురు మంచి వక్తలు కూడా. వారు మైక్ పట్టి ప్రసంగం మొదలెట్టారంటే.. ఎంతసేపైనా వినాలనిపిస్తుంది. ప్రతిపక్షాలకు తమ మార్క్ కౌంటర్స్ వేస్తూ ఉంటారు. హుందాతనం కోల్పోకుండా.. సబ్జెక్ట్‌పైన మాత్రమే బాణాలు సంధిస్తారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మినిస్టర్ కేటీఆర్‌కు ఆయన చెల్లెలు కల్వకుంట్ల కవితకు మధ్య ఉండే అన్నాచెల్లెళ్ల అనుబంధం ఎలాంటిదో స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. వారిద్దరూ ఎంతో ఆప్యాయంగా ఉంటారు. కేటీఆర్ తన చెల్లెలను ముద్దుగా పప్పు అని పిలుచుకుంటారు. రాఖీతో పాటు ఏమైనా పండుగలు వచ్చినప్పుడు.. ఒకరిపై ఒకరి ప్రేమను చాటుకుంటారు. చాలా సందర్భాల్లో పలు ఫ్యామిలీ ఫోటోలను కూడా ట్విటర్‌లో పంచుకుంటుంటారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్‌లో ఓ ఫోటో పోస్ట్ పెట్టారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా ఇటీవల 12 రోజులపాటు అమెరికాలో పర్యటించారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా అక్కడే చదువుతున్న కవిత తనయుడు ఆదిత్యను క్యాంపస్‌కు వెళ్లి కలిసి యోగక్షేమాలు తెలుసుకున్నారు. వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన కవిత తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘నా తనయుడు.. తన ప్రియతమ మామయ్య కేటీఆర్‌తో’ అని రాసుకొచ్చారు. ఈ ఫోటోను టీఆర్‌ఎస్ శ్రేణులు బాగా ట్రెండ్ చేస్తున్నారు.
My son with his beloved @KTRTRS Mamayya, who did not miss meeting Aaditya on his campus, despite busy schedule.#SiblingLove ❤️ #MyBrotherMyHero pic.twitter.com/4pW98p3Yle
— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 30, 2022
Also Read: Hyderabad: ఆన్‌లైన్‌లో మ్యాక్‌బుక్ ఆర్డర్ పెట్టిన యువకుడు.. పార్శిల్ వచ్చాక ఓపెన్ చేసి చూస్తే షాక్