AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tribal Reservations: గిరిజన రిజర్వేషన్ల పేరుతో మరోసారి మోసానికి ప్రయత్నిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ః మంత్రి సత్యవతి రాథోడ్

గిరిజన రిజర్వేషన్ల పెంపులో బిజెపి మరోసారి గిరిజనులను మభ్యపెట్టేవిధంగా అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతోందని రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ గారు ధ్వజమెత్తారు.

Tribal Reservations: గిరిజన రిజర్వేషన్ల పేరుతో మరోసారి మోసానికి ప్రయత్నిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ః మంత్రి సత్యవతి రాథోడ్
Satyavathi Rathode
Balaraju Goud
| Edited By: Basha Shek|

Updated on: Mar 30, 2022 | 2:53 PM

Share

Tribal Reservations Controversy: గిరిజన రిజర్వేషన్ల పెంపులో భారతీయ జనతా పార్టీ(BJP) మరోసారి గిరిజనులను మభ్యపెట్టేవిధంగా అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతోందని తెలంగాణ(Telangana) రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్(Satyavathi Rathode) గారు ధ్వజమెత్తారు. గిరిజన రిజర్వేషన్ల పెంపు రాష్ట్ర పరిధిలో ఉంటే అదేవిషయాన్ని కేంద్రం అధికారికంగా ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) సమాధానం ఇవ్వాలన్నారు. రిజర్వేషన్లను రాష్ట్రం పెంచుకునే అవకాశం ఉందని రాజ్యాంగమే చెబుతుందన్నారు. రిజర్వేషన్లు 10శాతానికి పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన సమయంలో బీజేపీ శాసనసభా పక్షనేతగా కిషన్ రెడ్డి ఎందుకు మద్దతు ఇచ్చారో చెప్పాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వమే గిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుకుంటే కేంద్రం అడ్డుపడకుండా బాధ్యత తీసుకుంటానన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, నిజంగా గిరిజనుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈ రిజర్వేషన్లను రాష్ట్ర పరిధిలో 10శాతం పెంచుకోవచ్చని కేంద్రం నుంచి అధికారికంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆలిండియా బంజారా సేవా సంఘం నూతన కమిటీ నేడు రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌ను హైదరాబాద్, మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసింది. మంత్రి వారిని సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. బంజారాల కోసం ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, పథకాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి నూతన కమిటీ రాష్ట్ర అధ్యక్షులు ఇస్లావత్ రామచంద్రు నాయక్, అసోసియేట్ అధ్యక్షులు ఆర్. మోహన్ సింగ్, మహిళా అధ్యక్షురాలు సరోజా సింగ్, మిగిలిన సభ్యులకు సూచించారు.

ముఖ్యమంత్రి కేసిఆర్ దాదాపు 81వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్న క్రమంలో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను పెంచకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోనున్నారని తెలిపారు. గిరిజన రిజర్వేషన్లను 10 శాతం పెంచాలని రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని కేంద్రానికి పంపితే ఇన్నేళ్లు పట్టించుకోకుండా ఇప్పుడు ఓట్ల కోసం బీజేపీ రాజకీయం చేస్తోందన్నారు. రిజర్వేషన్ల బిల్లు ఆమోదించినప్పుడు బిజెపి శాసనసభా పక్ష నాయకుడిగా ఉన్న ప్రస్తుత కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, ఎస్టీ రిజర్వేషన్లను రాష్ట్రమే పెంచుకోవచ్చు, కేంద్రం అడ్డుకుంటే దానికి నేను బాధ్యత వహిస్తాననడం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. ఇన్ని రోజులు గిరిజనులను ఓటుబ్యాంకుగా వాడుకున్న కాంగ్రెస్, బీజేపీలు మరోసారి గిరిజనులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. రిజర్వేషన్లు 50 శాతం దాటుతున్న క్రమంలో గిరిజన రిజర్వేషన్లు 10 శాతానికి పెంచాలంటే కచ్చితంగా కేంద్రం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందన్నారు. ఇది చేయకుండా కేవలం దాటవేత ధోరణితో, గిరిజనులను మభ్యపెట్టే విధంగా బీజేపీ వ్యవహరిస్తోందన్నారు.అవకాశ వాద రాజకీయాలకు పాల్పడుతూ, గిరిజనుల్లో బేధాలు కల్పిస్తూ విభజించి, పాలించే రాజకీయాలు చేస్తున్న బిజెపికి బంజారాలు తగిన బుద్ది చెప్పాలని, ఈ విషయంలో ఆలిండియా బంజారా సేవా సంఘం తన పాత్రను కీలకంగా పోషించాలని కోరారు.

Read Also….  Telangana: తెలంగాణలోని ఆ జిల్లాలో ఇష్టారీతిన కోతకాన్పులు.. దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన అధికారులు