Bapatla: సీమచింతకాయల కోసం చెట్టు ఎక్కిన విద్యార్థి.. కరెంట్ షాక్ తో విగతజీవిగా చెట్టు పైనే..
బాపట్ల జిల్లాలో విషాదం నెలకొంది. కొరిశెపాడు మండలం దైవాలరావూరు గ్రామానికి చెందిన అఖిల్.. స్థానిక పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు రోజు కావడంతో స్నేహితులతో కలిసి బయటకు...
ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లాలో విషాదం నెలకొంది. కొరిశెపాడు మండలం దైవాలరావూరు గ్రామానికి చెందిన అఖిల్.. స్థానిక పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు రోజు కావడంతో స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు. సీమ చింతకాయలు కోసేందుకు అఖిల్.. అతని ఫ్రెండ్.. చెట్టు ఎక్కారు. కాయలు కోస్తున్న సమయంలో చెట్టు పై ఉన్న విద్యుత్ తీగలు ప్రమాదవశాత్తు తగిలాయి. దీంతో కరెంట్ షాక్ కొట్టింది. ఈ ఘటనలో అఖిల్ అక్కడికక్కడే మృతి చెందాడు.
విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు.. ఘటనాస్థలానికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారం అందించారు. సరదాగా స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన తమ కుమారుడు.. ఇలా ఊహించని విధంగా మృత్యువాత పడటంతో బాలుడి తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు. అయితే.. బాలుడి మృతదేహం చెట్టుపైనే వేలాడుతుండటం మరింత విషాదానికి కారణమవుతోంది..
కాగా.. సెలవు రోజుల్లో పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు. ఏం చేస్తున్నారు.. అనే విషయాల పట్ల పేరెంట్స్ దృష్టి సారించాలి. ఈతకు వెళ్లడం, చెట్లు ఎక్కడం.. వంటివి గ్రామాల్లో కామన్ కాబట్టి.. అలా చేయకుండా వారిని వారించాలి. అన్ని రకాల జాగ్రత్తలు చెప్పాలి. లేకుంటే ఇలాంటి ఘటనలే జరుగుతాయంటున్నారు నిపుణులు…
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..