Annamayya district: తొమ్మిదో తరగతి విద్యార్థినికి కడుపునొప్పి.. ఆస్పత్రికి తీసుకెళ్లగా ప్రసవం.. అందరూ షాక్
గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న 14 ఏళ్ల విద్యార్థిని మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీనిపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. వెంటనే విచారణకు ఆదేశించారు.
అన్నమయ్య జిల్లాలో షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగుచూసింది. వాల్మీకిపురం జీఎంసీ బాలయోగి గురుకుల పాఠశాలలో నైన్త్ క్లాస్ చదువుతున్న ఓ విద్యార్థిని ప్రసవించింది. హాస్పిటల్‌లో మగ బిడ్డకు జన్మనిచ్చింది. పాఠశాలలో చదువుతున్న 14 ఏళ్ల అమ్మాయి ప్రసవించడంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. అధికారుల కంప్లైంట్‌తో పోలీసులు కేసు ఫైల్ చేసి విచారణ చేస్తున్నారు. స్కూల్ యాజమాన్యం బాలికలో మార్పులు ఎందుకు గుర్తించలేకపోయిందన్న అంశంపై వివరాలు సేకరిస్తున్నారు. అసలు ఆ అమ్మాయి గర్భవతి అవ్వడానికి కారణం ఎవరో తేల్చే పనిలో పడ్డారు పోలీసులు.
తిరుపతి జిల్లా వరదయ్యపాలెం చెందిన బాలిక వాల్మీకిపురం జీఎంసీ బాలయోగి గురుకుల పాఠశాలలో ఆరో తరగతిలో చేరింది. ప్రజంట్ విద్యార్థిని నెన్త్ క్లాస్ చదువుతోంది. శనివారం మధ్యాహ్నం తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో.. వెంటనే హాస్టల్ సిబ్బంది అలెర్టయ్యారు. విద్యార్థినిని వాల్మీకిపురం గవర్నమెంట్ హాస్పిటల్‌కి తీసుకువెళ్లారు. డాక్టర్లు స్కాన్ చేసి ప్రెగ్నెంట్ అని నిర్ధారించగా.. గంటల వ్యవధిలోనే మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఎమ్మార్వో, ఎస్సై హాస్పిటల్‌కి చేరుకుని బాలిక ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య చికిత్స కోసం తిరుపతికి తరలించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ తిరుపతి రుయా ఆసుపత్రిలో ఉన్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు బాలిక తల్లిదండ్రులు, కుటుంబసభ్యులను పోలీసులు విచారిస్తున్నారు.
మేనమామనే బాలిక గర్భం దాల్చడానికి కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఆ దిశగా విచారణ చేస్తున్నారు. స్థానిక ఎమ్మార్వో, ఎస్సై విషయాన్ని జిల్లా కలెక్టర్ విజయరామరాజు దృష్టికి స్కూల్ తీసుకెళ్లారు. ఈ ఘటనపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది ఇప్పటివరకు ఎందుకు గుర్తించలేదని ఫైరయ్యారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాల్సిందిగా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..