AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: ఒకే రోజు 25 మందిపై వీధి కుక్కల దాడి.. ఆసుపత్రికి క్యూ కట్టిన స్థానికులు..

ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పాతిక మందిని కరిచేసాయి. పిచ్చికుక్కల స్వైర విహారంతో ఆ ప్రాంతంలోని ప్రజలంతా బెంబేలెత్తిపోయారు. ఏమి చేయాలో తెలీక కుక్కల మీద తిరగబడలేక నానా అగచాట్లు పడ్డారు. సీన్ కట్ చేస్తే అంతా ప్రభుత్వాసుపత్రికి క్యూ కట్టారు. గ్రామ సింహాల ధాటికి ప్రజలు వీధులలో కాకుండా ఇళ్ళలోకి పరుగులు తీశారు. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని పదికి పైగా ప్రాంతాలలో పిచ్చికుక్కల స్వైరవిహారం చేశాయి.

AP News: ఒకే రోజు 25 మందిపై వీధి కుక్కల దాడి.. ఆసుపత్రికి క్యూ కట్టిన స్థానికులు..
Badwel Street Dogs
Sudhir Chappidi
| Edited By: Srikar T|

Updated on: Feb 09, 2024 | 1:20 PM

Share

ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పాతిక మందిని కరిచేసాయి. పిచ్చికుక్కల స్వైర విహారంతో ఆ ప్రాంతంలోని ప్రజలంతా బెంబేలెత్తిపోయారు. ఏమి చేయాలో తెలీక కుక్కల మీద తిరగబడలేక నానా అగచాట్లు పడ్డారు. సీన్ కట్ చేస్తే అంతా ప్రభుత్వాసుపత్రికి క్యూ కట్టారు. గ్రామ సింహాల ధాటికి ప్రజలు వీధులలో కాకుండా ఇళ్ళలోకి పరుగులు తీశారు. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని పదికి పైగా ప్రాంతాలలో పిచ్చికుక్కల స్వైరవిహారం చేశాయి. ఉదయం నుంచి కుక్కలదాడులతో ప్రభుత్వ ఆసుపత్రికి క్యూ కడుతున్నారు బాధితులు. వీటి మధ్య వెళ్లాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని మార్కెట్ యార్డ్, వీరారెడ్డి కాలేజ్, సుమిత్రానగర్, ఐలమ్మ కాలనీ, ఆంజనేయ నగర్, పట్టణంలోని మరికొన్ని ప్రాంతాలలో నడుచుకుంటూ వెళుతున్న వారిపై పిచ్చి కుక్కలు దాడులు చేస్తున్నాయి. పిచ్చికుక్కల దాడిలో సుమారు 25 మందిపైగా గాయాల పాలై వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి చేరారు.

ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న వారే కాకుండా గతంలోనూ పది మంది కుక్కలదాడిలో గాయపడినట్లు తెలుస్తోంది. వారిలో మహిళలు, వృద్ధులు, యువకులు ఉన్నారు. గత కొన్ని నెలలుగా మున్సిపాలిటీలోని పలు ప్రాంతాలలో కుక్కలతో ఇబ్బంది పడుతున్నామని అధికారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదంటున్నారు స్థానికులు. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. రోడెక్కితే కుక్కలతో కరిపించుకోలేక పనులు మానుకోలేక అవస్తలు పడుతున్నామని చెబుతున్నారు. అధికాకులేమో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం జిల్లా అధికారులైనా పట్టించుకోవాలని విన్నవించుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..