AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: గంజాయి బ్యాచ్‌ను వెంబడించి పట్టుకుని, పోలీసులకు అప్పజెప్పిన శ్రీకాకుళం ఎమ్మెల్యే

సాధారణంగా గంజాయి బ్యాచ్ జోలికి వెళ్లాలంటే సామాన్యులు ఎవరు సాహసించరు. వాళ్ల గుట్టు రట్టు చేసిన, వాళ్ళను పట్టుకోవాలని ప్రయత్నించిన వెంటనే చేతిలో ఉన్న ఆయుధాలతోను, బ్లేడులతోను దాడులకు దిగటం, భయభ్రాంతులకు గురిచేస్తుంది గంజాయి బ్యాచ్. పోలీసులు కూడా అటువంటి ప్రతిఘటనలను ఫేస్ చేసేందుకు సిద్ధపడే వాళ్ళను పట్టుకుంటారు.

Andhra Pradesh:  గంజాయి బ్యాచ్‌ను వెంబడించి పట్టుకుని, పోలీసులకు అప్పజెప్పిన శ్రీకాకుళం ఎమ్మెల్యే
Ganja Batch Arrest
S Srinivasa Rao
| Edited By: |

Updated on: Feb 11, 2025 | 3:56 PM

Share

ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి అక్రమ రవాణా, గంజాయి వాడకం ఎక్కువ అవుతుంది. పోలీసులు దీనిపై ఉక్కు పాదం మోపాలన్న ఉద్దేశంతో ఓ పక్క చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్, ఈగల్ టీమ్ వంటి ప్రత్యేక బృందాలలను రంగంలోకి దించుతున్నారు. అయినా గంజాయి మాఫీయా ఆగడాలను పూర్తిగా అరికట్టలేకపోతున్నారు. ముఖ్యంగా పొరుగున ఉన్న ఒరిస్సా నుండి ఉత్తరాంధ్ర జిల్లాల మీదుగా వీటి రవాణా ఎక్కువగా సాగుతోంది. అయితే మనం ఇంతవరకు గంజాయి బ్యాచ్ నీ పట్టుకున్న పోలీసుల గురించి, ఎక్సైజ్ అధికారుల గురించి విన్నాం.. కానీ ఓ ప్రజాప్రతినిధిగా ఉన్న ఎమ్మెల్యే స్వయంగా రంగంలోకి దిగారు. గంజాయి తాగుతున్న వాళ్ళని వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు.

శ్రీకాకుళం నడిబొడ్డున ఉన్న పొట్టి శ్రీరాములు మున్సిపల్ మార్కెట్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. మంగళవారం(ఫిబ్రవరి 11) ఉదయం మార్కెట్ సందర్శనకు వెళ్ళిన శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శoకర్‌కు ఒళ్ళు గగుర్పొడిచే అనుభూతి ఎదురైంది. ఎమ్మెల్యేకు గంజాయి బ్యాచ్ తారసపడింది. మార్కెట్‌లో ఖాళీగా ఉన్న ఓ బిల్డింగ్ బ్లాకుపైకి వెళుతుండగా మొదటి అంతస్తులో ఖాళీ మద్యం బాటిల్స్ కనిపించాయి. 2వ ఫ్లోర్‌లో కి వెళ్ళేసరికి బిల్డింగ్‌పై గంజాయి తాగుతూ ఇద్దరు యువకులు కనిపించారు. ఎమ్మెల్యేను చూడగానే ఆ ఇద్దరు యువకులు చేతిలో ఉన్న గంజాయి పొట్లాలను ఎవరికంట పడకుండా విసిరేసి పారిపోయేందుకు ప్రయత్నించారు.

అయితే వెంటనే ఎమ్మెల్యే గన్‌మెన్లు, అనుచరులు వారిని వెంబడించి పట్టుకున్నారు. యువకులు విసిరేసిన గంజాయి పొట్లాలను ఎమ్మెల్యే గొండు శంకర్ తెప్పించి వన్ టౌన్ పోలీసులకు ఆ ఇద్దరు యువకులను అప్పజెప్పారు. పట్టపగలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఘటన చోటుచేసుకోవడంపై ఎమ్మెల్యే శంకర్ సీరియస్ అయ్యారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పొట్టి శ్రీరాములు మున్సిపల్ మార్కెట్‌లోని నిరుపయోగంగా ఉన్న బ్లాకులను ఎమ్మెల్యే గొండు శంకర్ పరిశీలించారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఉన్నాయని, అస్తవ్యస్తంగా బిల్డింగ్స్ ఉండటం వల్ల ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడుతుందని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని చక్కబెట్టేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని ఎమ్మెల్యే తెలిపారు. మార్కెట్‌లోని బిల్డింగ్స్‌ను కూల్చివేసి అందరికీ సౌలభ్యంగా ఉండేలా అధునాతన బిల్డింగ్స్ నిర్మాణం చేపడతామన్నారు. దానికి వర్తకులు, తోపుడు బళ్ల వ్యాపారులు, కళాసీలు, నగర వాసులు సహకరించాలని ఎమ్మెల్యే శంకర్ కోరారు.

సాధారణంగా గంజాయి బ్యాచ్ జోలికి వెళ్లాలంటే సామాన్యులు ఎవరు సాహసించరు. వాళ్ల గుట్టు రట్టు చేసిన, వాళ్ళను పట్టుకోవాలని ప్రయత్నించిన వెంటనే చేతిలో ఉన్న ఆయుధాలతోను, బ్లేడులతోను దాడులకు దిగటం, భయభ్రాంతులకు గురిచేస్తుంది గంజాయి బ్యాచ్. పోలీసులు కూడా అటువంటి ప్రతిఘటనలను ఫేస్ చేసేందుకు సిద్ధపడే వాళ్ళను పట్టుకుంటూ ఉంటారు. అలాంటిది ఒక ప్రజాప్రతినిధిగా తన నియోజకవర్గ పరిధిలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగకూడదనే గంజాయి తాగే వాళ్ళను పోలీసులకు పట్టించారు. ఎమ్మెల్యే గొండు శంకర్. ఈ క్రమంలో గంజాయి బ్యాచ్ నుండి తనకు ఏమి జరిగినా దానిని ఫేస్ చేయడానికి సిద్ధమని తెలిపారు. మార్కెట్ లో గంజాయి దొరికింది అంటే ఏదో బ్యాచ్ ఇక్కడ పనిచేస్తుందని, ఇక్కడికి గంజాయి ఎక్కడ నుండి వస్తుంది. ఎవరు అమ్ముతున్నారు అన్నవి తెలియాలని అన్నారు. పోలీసుల మార్కెట్ ను విరివిగా తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..