AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: స్కూల్‌కి వచ్చి బాలుడ్ని కిడ్నాప్ చేశారు.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్

బాలుడ్ని గుర్తు తెలియని ఆగంతకులు తీసుకెళ్లారు. కానీ కొద్దిసేపటి తర్వాత విడిచిపెట్టారు. అలసు బాలుడ్ని తీసుకెళ్లింది ఎవరు.. మళ్లీ ఎందుకు వదిలేశారు... పోలీసుల గురించి భయపడి వెనక్కి తగ్గారా..? ఈ కేసులో అన్నీ మిస్టరీలే ఉన్నాయి. తాజాగా ఈ కేసుపై పోలీసులు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే...

Andhra News: స్కూల్‌కి వచ్చి బాలుడ్ని కిడ్నాప్ చేశారు.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్
Boy Kidnap
Pvv Satyanarayana
| Edited By: |

Updated on: Feb 11, 2025 | 12:43 PM

Share

కాకినాడ జిల్లా తునిలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. కిడ్నాప్ చేసింది ఎవరు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. స్థానిక భాష్యం స్కూల్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ పరమేష్ కిడ్నాప్‌కి గురయ్యాడు. ప్రతి రోజులానే పరమేష్ స్కూల్‌కి వెళ్లాడు. ఉదయం 10 గంటల సమయంలో బాలుడికి సిరప్ పట్టాలని చెప్పి అగంతకుడు పరమేష్‌ని స్కూల్ నుంచి బయటికి తీసుకెళ్లాడు. కొద్దిసేపటికి బాలుడి తల్లిదండ్రులు స్కూల్‌కి లంచ్ బాక్స్ తీసుకుని రాగ క్లాస్ రూమ్‌లో పరమేశ్ లేడు. కొద్దిసేపటి క్రితమే మీ షాపులో సిబ్బంది వచ్చి తీసుకెళ్లారు అని స్కూల్ స్టాఫ్ చెప్పారు. దీంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా ఆందోళనకు గురైయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, బాలుడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. బాలుడి మిస్సింగ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడంతో కిడ్నాప్ చేసిన అగంతకుడు తుని మండలంలోని డి.పోలవరం దగ్గర బాలుడ్ని ఓ ఆటో డ్రైవర్‌కి అప్పగించి.. తల్లదండ్రులు, అడ్రస్ డీటేల్స్ చెప్పి అక్కడ దింపమన్నారు. దీంతో ఆటో డ్రైవర్ బాలుడి తండ్రికి ఫోన్ చేసి బాబు తన వద్దే ఉన్నట్లు చెప్పి క్షేమంగా తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించాడు.

అయితే ఇంత వరకు బానే ఉంది కానీ బాలుడ్ని కిడ్నాప్ చేసింది ఎవరు..? ఎందుకు కిడ్నాప్ చేశారు అనే ప్రశ్నకి ఇంకా సమాధానం రాలేదు. అస్సలు ఈ విషయంపై పోలీసుల దర్యాప్తు ఎలా సాగుతుంది తేలాల్సి ఉంది. బాబు క్షేమంగా దొరికాడు కాబట్టి అంతా ఊపిరి పీల్చుకున్నారు.

మరో పక్క కార్పొరేట్ స్థాయి స్కూళ్లలో సీసీ కెమెరాలు లేకపోవడం గమనార్హం.పెద్ద మొత్తంలో ఫీజులు వసూళ్లు చేసే యాజమాన్యాలు ఇలాంటి మౌలిక సదుపాయాలపై ఎందుకు దృష్టి పెట్టడం లేదు. అయితే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి