Andhra Pradesh: ఆస్పరి కేజీబీవీకి ప్రత్యేక గుర్తింపు..యోగాలో పతకాలు
కర్నూలు జిల్లాలోని ఆస్పరి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో చదువుతో పాటు బాలికలు యోగాలో కూడా రాణిస్తున్నారు. మానసిక ఆరోగ్య పరిరక్షణ సూత్రాలను అనుసరిస్తూ నిత్యం ఆసనాల విన్యాసం చేస్తున్నారు. అక్కడి బాలికల యోగా ఆసనాల విన్యాసాలకు రాష్ట్ర, జాతీయ స్థాయి పతకాలు వచ్చాయి.
కర్నూలు జిల్లాలోని ఆస్పరి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో చదువుతో పాటు బాలికలు యోగాలో కూడా రాణిస్తున్నారు. మానసిక ఆరోగ్య పరిరక్షణ సూత్రాలను అనుసరిస్తూ నిత్యం ఆసనాల విన్యాసం చేస్తున్నారు. అక్కడి బాలికల యోగా ఆసనాల విన్యాసాలకు రాష్ట్ర, జాతీయ స్థాయి పతకాలు వచ్చాయి. కర్నూలు జిల్లా అస్పరి మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో దాదాపు 250 మందికి పైగా బాలికలు చదువుతున్నారు. వారిలో ఆరవ తరగతి నుంచి ఇంటర్ చదువుతున్న బాలికలు ఉన్నారు. వారిలో కొందరు నిత్యం ఉదయం నిద్ర లేవగానే చదువుతో పాటు యోగాలో అద్భుతమైన ఆరోగ్య పరిరక్షణకు సంబంధించినా ఆసనాలతో అదరగొడుతున్నారు. మానసిక ఒత్తిడిని జయించే యోగా ఆసనాలతో ఆరోగ్య పరిరక్షణ సూత్రాలను అనుసరిస్తూ ఏకగ్రతతో ప్రత్యేక దినచర్యగా చేస్తున్నారు.
వివిధ యోగా ఆసనాలలో కీలకమైన ఆసనాలు చేస్తూ జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణిస్తున్నారు. జాతీయ స్థాయి యోగా ఆసనాల విన్యాసాలకు కొందరు బాలికలు నిత్యం సాధన చేస్తున్నారు. ఇటీవల జరిగిన యోగా ఆసనాల విన్యాసాలలో జిల్లా , రాష్ట్ర స్థాయిలో పల్లవి అనే విద్యార్థిని ప్రతిభ చాటింది. పల్లవి అనే విద్యార్థిని ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. పల్లవి తల్లితండ్రులు వ్యవసాయ కూలీలుగా చేస్తున్నారు. ఈమె జాతీయ స్థాయి యోగా ఆసనాల విన్యాసాల పోటీలకు ఎంపిక అయింది. వరసగా 2021,2022,2023, యోగా ఆసనాల విన్యాసాల పోటీలలో ప్రతిభ చూపింది. ఇలా బాలికలు ప్రతిభ కనబరిచడానికి KGBV ప్రిన్సిపాల్ ప్రోద్బలతో మహిళా పీఈటీ కృషి చేసింది. నిత్యం యోగా ఆసనాల విన్యాసాలను బాలికలకు చూపుతూ వివిధ రకాల పోటీలకు బాలికలు ఎంపిక అయ్యేలా పీఈటీ పలు సూచనలు సలహాలను అందజేస్తుంది.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..