Indian Railway: సికింద్రాబాద్, విశాఖపట్నం నుంచి ఇతర ప్రాంతాలకు మరిన్ని ప్రత్యేక రైళ్లు
Indian Railway: ప్రయాణికుల రద్దీని బట్టి రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతూ ఉంటుంది. ఇక తాజాగా సికింద్రాబాద్, విశాఖపట్నం నుంచి ఇతర ప్రాంతాలకు
Indian Railway: ప్రయాణికుల రద్దీని బట్టి రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతూ ఉంటుంది. ఇక తాజాగా సికింద్రాబాద్, విశాఖపట్నం నుంచి ఇతర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. రైలు నెంబర్ 07051 సికింద్రాబాద్ నుంచి చాప్రా మధ్య ప్రతీ ఆదివారం నడుస్తుంది. జూలై 18, 25, ఆగస్ట్ 1 తేదీల్లో ఈ రైలు అందుబాటులో ఉంటుంది. రైలు నెంబర్ 07052 చాప్రా నుంచి సికింద్రాబాద్ మధ్య ప్రతీ మంగళవారం నడుస్తుంది. ఈ రైలు జూలై 20, 27, ఆగస్ట్ 2 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. రైలు నెంబర్ 09016 ఇండోర్ నుంచి లింగంపల్లి వరకు జూలై 17 నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేవరకు అందుబాటులో ఉంటుంది. రైలు నెంబర్ 09015 లింగంపల్లి నుంచి ఇండోర్ వరకు జూలై 18 నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఈ రైలు అందుబాటులో ఉంటుంది. రైలు నెంబర్ 08565 విశాఖపట్నం నుంచి హెచ్ఎస్ నాందేడ్ వరకు ప్రతీ మంగళవారం, బుధవారం, శనివారం రైల్వేశాఖ నుంచి ఆదేశాలు వచ్చేవరకు అందుబాటులో ఉంటుంది. రైలు నెంబర్ 08566 హెచ్ఎస్ నాందేడ్ నుంచి విశాఖపట్నం వరకు ప్రతీ బుధవారం, గురువారం, ఆదివారం తదుపరి ఆదేశాలు వచ్చేవరకు అందుబాటులో ఉండనుంది.
అలాగే రైలు నెంబర్ 08528 విశాఖపట్నం-రాయ్‌పూర్ రూట్‌లో జూలై 15 నుంచి అందుబాటులోకి రానుంది. రైలు నెంబర్ 08516 విశాఖపట్నం-కిరండూల్ రూట్‌లో జూలై 15 నుంచి అందుబాటులోకి రానుంది. రైలు నెంబర్ 08561 విశాఖపట్నం-కాచిగూడ రూట్‌లో జూలై 15 నుంచి అందుబాటులోకి రానుంది. రైలు నెంబర్ 07488 విశాఖపట్నం-కడప రూట్‌లో జూలై 15 నుంచి అందుబాటులోకి రానుంది. రైలు నెంబర్ 02831 విశాఖపట్నం-లింగంపల్లి రూట్‌లో జూలై 15 నుంచి అందుబాటులోకి రానుంది. రైలు నెంబర్ 08527 రాయ్‌పూర్-విశాఖపట్నం రూట్‌లో జూలై 16 నుంచి అందుబాటులోకి రానుంది. రైలు నెంబర్ 08527 రాయ్‌పూర్-విశాఖపట్నం రూట్‌లో జూలై 16 నుంచి అందుబాటులోకి రానుంది. రైలు నెంబర్ 08515 కిరండూల్- విశాఖపట్నం రూట్‌లో జూలై 16 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. రైలు నెంబర్ 08562 కాచిగూడ-విశాఖపట్నం రూట్‌లో జూలై 16 నుంచి అందుబాటులోకి రానుంది.
రైలు నెంబర్ 07487 కడప-విశాఖపట్నం రూట్‌లో జూలై 16 నుంచి అందుబాటులోకి రానుంది. రైలు నెంబర్ 02832 లింగంపల్లి-విశాఖపట్నం రూట్‌లో జూలై 16 నుంచి అందుబాటులోకి రానుంది. రైలు నెంబర్ 02832 లింగంపల్లి-విశాఖపట్నం రూట్‌లో జూలై 16 నుంచి అందుబాటులోకి రానుంది. రైలు నెంబర్ 02885 భువనేశ్వర్ నుంచి కృష్ణరాజపురం వరకు ప్రతీ బుధవారం తదుపరి ఆదేశాలు వచ్చేవరకు అందుబాటులో ఉంటుంది.
రైలు నెంబర్ 02886 కృష్ణరాజపురం నుంచి భువనేశ్వర్ వరకు ప్రతీ గురువారం తదుపరి ఆదేశాలు వచ్చేవరకు అందుబాటులో ఉంటుంది. రైలు నెంబర్ 04692 అమృత్‌సర్ నుంచి హెచ్ఎస్ నాందేడ్ వరకు ప్రతీ సోమవారం తదుపరి ఆదేశాలు వచ్చేవరకు అందుబాటులో ఉంటుంది. రైలు నెంబర్ 04691 హెచ్ఎస్ నాందేడ్ నుంచి అమృత్‌సర్ వరకు ప్రతీ బుధవారం తదుపరి ఆదేశాలు వచ్చేవరకు అందుబాటులో ఉంటుంది. రైలు నెంబర్ 04672 న్యూఢిల్లీ నుంచి పుదుచ్చెరి వరకు ప్రతీ ఆదివారం తదుపరి ఆదేశాలు వచ్చేవరకు అందుబాటులో ఉంటుంది. అలాగే రైలు నెంబర్ 04671 పుదుచ్చెరి నుంచి న్యూఢిల్లీ వరకు ప్రతీ బుధవారం తదుపరి ఆదేశాలు వచ్చేవరకు అందుబాటులో ఉంటుంది.