AP High Court: కోర్టు తీర్పును ధిక్కరిస్తారా.? అయితే సేవ చేయడమే మీకు పనిష్మెంట్.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు.
AP High Court: సాధారణంగా కోర్టు తీర్పులను ధిక్కరిస్తే జైలు శిక్ష లేదా జరిమాన విధిస్తారు. కొన్ని సందర్భాల్లో రెండూ ఉంటాయి. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఓ తీర్పు...
AP High Court: సాధారణంగా కోర్టు తీర్పులను ధిక్కరిస్తే జైలు శిక్ష లేదా జరిమాన విధిస్తారు. కొన్ని సందర్భాల్లో రెండూ ఉంటాయి. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఓ తీర్పు అందరినీ ఆకర్షిస్తోంది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు మిర్చి మార్కెట్ యార్డులో కమీషన్ ఏజెంట్లు లైసెన్స్‌లు రెన్యూవల్ చేయాలంటూ కొంతమంది 2017లో హైకోర్టును ఆశ్రయించారు. ఆ సమయంలో దీనిపై విచారించిన కోర్టు రెన్యూవల్ చేయాలంటూ గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు, అప్పటి కార్యదర్శి శ్రీనివాసరావులను ఆదేశించింది. అయితే కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ లైసెన్స్‌లు రెన్యూవల్ చేయలేదంటూ 2018లో కోర్టు ధిక్కరణ కేసులు వేశారు.
దీంతో తాజాగా దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పును ధిక్కారించిన వారిని ఎనిమిది ఆదివారాలు సామాజిక సేవ చేయాలని హైకోర్టు ఆదేశించింది. సదరు వ్యక్తులు కోర్టుకి క్షమాపణ చెప్పినప్పటికీ సామాజిక సేవ చేయాలంటూ ఇద్దరిని ఆదేశించింది. వృద్ద, అనాథాశ్రామాల్లో టిఫిన్, భోజన ఏర్పాట్లు చేయాలని అందుకు అయ్యే ఖర్చు వారే భరించాలని చెప్పింది… ఆయా ఆశ్రమాలు ఇచ్చిన సేవా ధృవ పత్రాలను స్థానిక మేజిస్ట్రేట్లు హైకోర్టుకు అందివ్వాలని చెప్పింది. కోర్టుకు ఇచ్చిన హామీ మేరకు నడుచుకోవాలని లేకుంటే కోర్టు ధిక్కార కేసులను పునరుద్దరిస్తామని హెచ్చరించింది.
Also Read: NABARD Recruitment: నాబార్డ్‌లో భర్తీకి జాబ్ నోటిఫికేషన్.. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి..
Hallmarking: బంగారు ఆభరణాల హాల్‌మార్కింగ్ ఆలస్యం.. ఇబ్బందుల్లో ఆభరణాల వ్యాపారులు