Hallmarking: బంగారు ఆభరణాల హాల్‌మార్కింగ్ ఆలస్యం.. ఇబ్బందుల్లో ఆభరణాల వ్యాపారులు

Hallmarking: దేశంలోని 256 జిల్లాల్లో బంగారు ఆభరణాలు, కళాఖండాలపై తప్పనిసరిగా హాల్‌మార్కింగ్ విధానం అమలులోకి వచ్చి నెల రోజులు గడిచిపోయాయి. కానీ, ఇప్పటివరకు ఈ వ్యవస్థ సజావుగా సాగడం లేదు.

Hallmarking: బంగారు ఆభరణాల హాల్‌మార్కింగ్ ఆలస్యం.. ఇబ్బందుల్లో ఆభరణాల వ్యాపారులు
Hallmarking
Follow us

| Edited By: KVD Varma

Updated on: Jul 15, 2021 | 2:01 PM

Hallmarking: దేశంలోని 256 జిల్లాల్లో బంగారు ఆభరణాలు, కళాఖండాలపై తప్పనిసరిగా హాల్‌మార్కింగ్ విధానం అమలులోకి వచ్చి నెల రోజులు గడిచిపోయాయి. కానీ, ఇప్పటివరకు ఈ వ్యవస్థ సజావుగా సాగడం లేదు. హాల్‌మార్కింగ్ కేంద్రాలు చాలా నగరాల్లో అవసరం కంటే తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. అంతకుముందు హాల్‌మార్క్ చేయడానికి ఒక రోజు తీసుకునేది. కానీ, ఇప్పుడు మారిన విధానంలో దీనికి మూడు, నాలుగు రోజులు పడుతోంది. ఇది మాత్రమే కాదు, ప్రతిరోజూ కొత్త నిబంధనలు వస్తున్నందున, ఆభరణాల అమ్మకాలు ఇబ్బందుల్లో పడ్డాయి.

గుజరాత్‌లో 23 హాల్‌మార్కింగ్ కేంద్రాలు ఉండగా, 75-80 కేంద్రాలు అవసరం. ఇక్కడి ఆభరణాలను గుర్తించడానికి 2-3 రోజులు పడుతుంది. అదేవిధంగా, గోల్డెన్ సిటీగా పిలువబడే మహారాష్ట్రలోని జల్గావ్‌లో 250 కి పైగా ఆభరణాల దుకాణాలు ఉన్నాయి. దీనికి కనీసం 6 కేంద్రాలు అవసరం. కానీ 3 కేంద్రాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఒక కేంద్రం ఒక రోజులో 300-400 వస్తువులను మాత్రమే గుర్తించగలదు. జైపూర్ బులియన్ ట్రేడర్స్ కమిటీ చైర్మన్ కైలాష్ మిట్టల్ చెబుతున్న దాని ప్రకారం, ప్రభుత్వం ప్రతి ఆభరణాల వస్తువుకు హాల్‌మార్క్ యూనిట్ ఐడెంటిఫికేషన్ (హెచ్‌యుఐడి) నంబర్లను అమలు చేసింది. ప్రస్తుతం దీనిపై గందరగోళం నెలకొంది. ఈవిధానంలో ఇంకా చాలా అసమానతలు ఉన్నాయి.

బిఐఎస్ ఏం చేబుతోందంటే.. 40 లక్షల రూపాయల వరకు టర్నోవర్ ఉన్నవారికి హాల్‌మార్కింగ్ రిజిస్ట్రేషన్ నుండి మినహాయింపు ఉంటుంది. అయితే, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) అటువంటి ఆభరణాలు హాల్‌మార్క్ చేసిన ఆభరణాలను విక్రయిస్తే మాత్రం, వారు తప్పనిసరిగా నమోదు చేసుకోవలసి ఉంటుందని చెప్పారు. అదేవిధంగా, పాత స్టాక్‌ను తొలగించడానికి ప్రభుత్వం ఆగస్టు 31 వరకు సమయం ఇవ్వగా, బిఐఎస్ కొత్త ఉత్తర్వుల ప్రకారం జ్యువెలర్స్ జూలై 31 లోగా ప్రకటించాల్సి ఉంటుంది.

కేంద్రాలను పెంచాల్సిన అవసరం..

అహ్మదాబాద్ జ్యువెలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆశిష్ జావేరి చెబుతున్నదాని ప్రకారం, రాబోయే 1-2 నెలల్లో గుజరాత్‌లో హాల్‌మార్కింగ్ కేంద్రాల సంఖ్య పెరగకపోతే, రాష్ట్ర వ్యాపారం ఇతర రాష్ట్రాలకు మళ్ళిపోయే అవకాశం ఉంది.

హాల్‌మార్కింగ్‌లో సమస్యలు..

కొత్తగా తీసుకువచ్చిన ఈ విధానంలో చిన్న, మధ్యతరహా ఆభరణాల విక్రేతలు కంప్యూటర్ సిస్టమ్, నిపుణుల అంకితభావంతో పనిచేసే సిబ్బందిని నియమించుకోవాల్సి ఉంటుంది. దాని వలన ఖర్చు పెరుగుతుంది. హాల్‌మార్క్ కోసం ఆభరణాలను పంపే విధానం ఆన్‌లైన్‌లో కి మారడమే ఇందుకు కారణం. చిన్న, మధ్యతరగతి ఆభరణాల తయారీ దారులకు ఇందులో నైపుణ్యం లేదు. పెద్ద సంఖ్యలో చిన్న ఆభరణాల వస్తువుల కారణంగా, హాల్‌మార్కింగ్ కేంద్రాలు వాటి వివరాలను ఉంచడం కష్టమవుతోంది.

Also Read: LIC Jeevan Akshay: రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ కావాలా.. ఒక్కసారి చెల్లించి ప్రతి నెల డబ్బులు తీసుకోండి.. అయితే ఇలా ప్లాన్ చేసుకోండి

IT Returns: పన్ను కట్టేంత ఆదాయం లేదని రిటర్న్స్ వేయడం మానవద్దు.. ఐటీ రిటర్న్స్ వలన ప్రయోజనాలు తెలుసుకోండి!