గోల్డ్ లోన్ వడ్డీ రేటు 9 నుండి 10% ఉంటుంది. ఇది వ్యక్తిగత రుణ రేటు కంటే తక్కువ. పర్సనల్ లోన్ రేటు ఎక్కువగా ఉంటుంది. ఇది 11 నుండి 18% వరకు ఉంటుంది.
గోల్డ్ లోన్‌లో ఆభరణాలు తాకట్టు పెట్టాల్సి ఉంటుంది. ఎటువంటి గ్యారంటీ లేకుండా వ్యక్తిగత రుణం లభిస్తుంది. నగలు పోతాయనే భయం లేదు. కానీ మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతినే అవకాశం ఉంది.
బంగారు రుణంలో ఆభరణాలను తనిఖీ చేసిన తర్వాత రుణం ఇవ్వడం జరుగుతుంది. పర్సనల్ లోన్ కోసం, ఆదాయం, క్రెడిట్ స్కోర్, జాబ్ రికార్డ్ పరిగణంలోకి తీసుకుంటారు.
బంగారు రుణం ఆభరణాల విలువ ఆధారంగా గరిష్టంగా 75% వరకు ఇస్తారు. ఆదాయానికి అనుగుణంగా వ్యక్తిగత రుణం లబిస్తుంది. అయితే EMI ఆదాయంలో 50% కంటే ఎక్కువ ఉండకూడదు.
వ్యక్తిగత రుణాన్ని పెళ్లి, ప్రయాణం లేదా ఇతర ఖర్చుల కోసం ఉపయోగించవచ్చు. గోల్డ్ లోన్ సాధారణంగా అత్యవసర అవసరాల కోసం తీసుకుంటారు.
బంగారు రుణంలో ఆభరణాలు తాకట్టు పెట్టాలనే భయం నెలకొంది. వ్యక్తిగత రుణాలకు ఎలాంటి గ్యారెంటీ అవసరం ఉండదు.
వ్యక్తిగత రుణం సకాలంలో చెల్లించకపోవడం వల్ల మీ క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీస్తుంది. బంగారు రుణంలో అలంటి సమస్య ఉండదు.
మీకు తక్కువ వడ్డీ రేటు మరియు ఆభరణాలు కావాలంటే, బంగారు రుణం తీసుకోండి. మీకు గ్యారెంటీ లేకుండా డబ్బు కావాలంటే, పర్సనల్ లోన్ ఉత్తమం. మీ అవసరం, పరిస్థితిని బట్టి నిర్ణయించుకోండి.