ప్రధాని మోదీ ఇప్పటివరకు ఎన్ని దేశాలు సందర్శించారు?

TV9 Telugu

22 November 2024

భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం 3 దేశాల్లో ఐదు రోజుల పర్యటనలో ఉన్నారన్న విషయం తెలిసిందే.

ప్రధాని నరేంద్ర మోదీ తొలుత నైజీరియా వెళ్లి, ప్రస్తుతం బ్రెజిల్‌లో ఉన్న అనంతరం గయానాకు పర్యటించనున్నారు.

నరేంద్ర మోదీ ప్రధానమంత్రి పగ్గాలు చేప్పట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని దేశాలకు వెళ్లారో తెలుసుకుందాం..

2014లో తొలిసారి ప్రధాని అయినప్పటి నుండి జూలై 2024 వరకు మొత్తం 7 ఖండాలలో 6 ఖండాలను ప్రధాని సందర్శించారు.

2024 జూలై 10 వరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ తన పదవీ కాలంలో ఇప్పటివరకు 79 విదేశీ పర్యటనలకు వెళ్లారు.

2014 సంవత్సరంలో తొలిసారి ప్రధానమంత్రి అయిన తర్వాత తొలిసారి భూటాన్‌ దేశంలో పర్యటించారు ప్రధాని నరేంద్ర మోదీ.

మీడియా నివేదికల ప్రకారం, ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా, మయన్మార్, ఆస్ట్రేలియాలో పర్యటించారు.

ఈ పర్యటనల సందర్భంగా ప్రధాని మోదీ 68 దేశాల్లో పర్యటించారు. 2015లో ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్థాన్‌తో సహా మొత్తం 30 దేశాల్లో పర్యటించారు.