Maredumilli: పుష్ప దెబ్బతో టూరిస్ట్ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప-2 సినిమాతో మన్యంలోని చాలా పర్యాటక ప్రాంతాలు ప్రపంచానికి పరిచయం కానున్నాయి. పుష్ప-2 మూవీలోని యాక్షన్ పార్ట్‌తోపాటు కీలక సన్నివేశాలు రంపచోడవరం, మారేడిమిల్లి అడవుల్లోనే చిత్రీకరించారు. మూవీలోని ఛేజింగ్ సీన్స్ కూడా ఈ ప్రాంతంలోనే షూట్ చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. సినిమా కోసం తయారు చేసిన ఎర్రచందనం దుంగలు, ఇతర మెటిరియల్స్ ఆ ప్రాంతంలో చాలా చోట్ల కనిపిస్తాయి. ఇక్కడ షూట్ చేసిన సీన్స్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయంటున్నారు స్థానికులు.
రంపచోడవరంకు 10 నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలు పుష్ప స్పాట్ అనే బోర్డులతో దర్శనమిస్తున్నాయి. సినిమాలో పోలీసులు, హీరోకు సంబంధించిన సన్నివేశాలు ఇక్కడే షూట్ చేయడంతో ఈ ప్రాంతాలకు పుష్ప స్పాట్ అని పేరు పెట్టారు. దీంతో ఆ ప్రాంతమంతా ఇప్పుడు టూరిస్ట్ స్పాట్‌గా మారింది. సినిమాలోని ఫైట్ సీన్స్, సునీల్ చేసిన మంగళంసీను పాత్రకు సంబంధించిన సన్నివేశాలు ఈ అడవి మధ్యలో షూట్ చేసినట్లు స్థానికులు, పర్యాటకులు చెబుతున్నారు.
భీమవరం ప్రాంతానికి 10 కిలోమీటర్ల దూరంలో వాడపల్లి ప్రాంతంలో ఎర్రచందనం చెట్లు కొట్టడానికి కూలీలలను తీసుకెళ్లే సీన్స్ షూట్ చేశారు. దీంతో వాడపల్లి గ్రామం పేరు మార్మోగుతోంది. వాడపల్లి గ్రామస్తులు కూడా కొన్ని సన్నివేశాల్లో నటించారు. ఏది ఏమైనా పర్యాటకానికి మరింత ఆయూవు పోసిన పుష్పతో పాటు, తాజాగా విడుదలకు సిద్ధంగా ఉన్న పుష్ప 2 కీలకమైన సీన్లను మారేడుమిల్లి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించడంతో రంపచోడవరం నియోజకవర్గం టాక్ ఆఫ్ టూ స్టేట్స్‌గా మారింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??

