ఇండియాలోనే ఉన్నానా ?? నమ్మలేకపోయిన జపాన్ టూరిస్ట్
ఇండియాకి వచ్చిన ఓ జపాన్ టూరిస్ట్ షాక్ అయ్యింది. తాను ఇండియాలో ఉన్నా.. జపాన్‌లో ఉన్నట్టు అనిపించిందని పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ జపాన్ టూరిస్ట్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. సాధారణంగా వివిధ దేశాల నుంచి ఇండియాకు అనేక మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే జపాన్‌కు చెందిన ఓ ట్రావెల్ వ్లాగర్ కికీ చెన్ అనే ఓ యువతి.. భారత్‌కు వచ్చింది.
ఈమె బెంగుళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులోని టెర్మినల్ 2లో దిగింది. అక్కడ చేసిన డిజైన్స్‌కి ఈ యువతి ముగ్దురాలైంది. వెంటనే వీడియో వ్లాగ్ చేయడం మొదలు పెట్టింది. నేను ఇండియాలో ఉన్నానో.. జపాన్‌లో ఉన్నానో అర్థం కావడం లేదని వీడియో స్టార్ట్ చేసింది. నేను ఇండియాలో ఉన్నాను అని నిజంగా నమ్మలేక పోతున్నా.. ఈ ఎయిర్ పోర్ట్ చాలా బావుంది. అంటూ ఎయిర్ పోర్టులో ఉండే ప్లేసులన్నీ చూపించింది కికీ. అంతే కాకుండా అక్కడ కొన్ని రకాల ఫొటోలు కూడా దిగింది. ఆ తర్వాత ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట జోరుగా వైరల్ అవుతోంది. ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బంగారంతో పాటు ఇతర ఖనిజాలను.. ఎలా వెలికితీస్తారో తెలుసా ??
ఒమేగా 3 కోసం చేపలే తినక్కరలేదు.. శాఖాహారంలో వీటిని ట్రై చేయండి !!
మిమ్మల్ని యంగ్ గా ఉంచే మ్యాజిక్ టీ.. ఈ పూలతో చేసే టీ తాగితే నిత్య యవ్వనం !!
టీపొడిని కూడా వదలరేంట్రా !! నకిలీ టీపొడిలో ఏమేం కలుపుతారో తెలుసా ??
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం
జిమ్ చేస్తూ చూపు కోల్పోయిన యువకుడు..! కారణం తెలిస్తే షాక్
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?

