అంబానీ కారు డ్రైవర్ జీతం ఎంతో తెలుసా ?? అసలు కథ ఇది !!
మన దేశ కుబేరుడు ముఖేశ్ అంబానీ... ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరు. ఏకంగా రూ.15 వేల కోట్లకుపైగా విలువైన ఇల్లు, లక్షల కోట్ల ఆస్తులు ఆయన సొంతం. ఆయన ఎక్కడికి వెళ్లినా కట్టుదిట్టమైన భద్రత. మరి అలాంటి ముఖేశ్ అంబానీ కారు నడిపే డ్రైవర్ జీతం ఎంతో తెలుసా? నిజానికి ఈ వివరాలు రహస్యంగా ఉంటాయి. కానీ జాతీయ ఆంగ్ల మీడియా వివిధ మార్గాల్లో వివరాలను సేకరించి వెల్లడిస్తుంటుంది.
ముఖేశ్ అంబానీ సంపద 2014 అక్టోబర్ 20వ తేదీ నాటికి సుమారు 8.5 లక్షల కోట్లు. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ఆయన 17వ స్థానంలో ఉన్నారు. మరి ఆయన కారు నడిపే డ్రైవర్ జీతం ఎంత అంటారా? 2017 నాటి లెక్కల ప్రకారం, అంటే ఏడేళ్ల కిందట నెలకు రూ. 2 లక్షలు. అంటే ఏడాదికి రూ.24 లక్షలు వేతనంగా చెల్లించారు. అదే ఇప్పుడు సుమారు ఇంతకు రెండింతల వరకు ఉంటుందని జాతీయ మీడియా పేర్కొంటోంది. అంటే సుమారు నెలకు రూ.4 లక్షల వరకు, ఏడాది మొత్తంగా చూస్తే 48 లక్షల వరకు జీతం అందుతుందన్న మాట. కేవలం డ్రైవింగ్ కోసమే అంత జీతమా? అంటే దేశంలోని అత్యంత ముఖ్యమైన, కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే వ్యక్తి ముఖేశ్ అంబానీ. ఆయన కారును నడిపే వ్యక్తి… అంబానీకి అన్ని రకాలుగా భద్రత కల్పించేవారిగా ఉండేలా చూస్తారు. సదరు డ్రైవర్ కు మిలటరీ స్థాయిలో డ్రైవింగ్ నైపుణ్యాలపై శిక్షణ ఉంటుంది. ఒక సైనికుడి తరహాలో ఫిట్ నెస్ ఉండాలి. అత్యంత విలాసవంతమైన, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను వారు నడపాల్సి ఉంటుంది. అత్యవసర పరిస్థితిలో ప్రాణాలు అడ్డుపెట్టి అయినా తమ యజమానిని రక్షించే సామర్థ్యం కూడా ఉండాలి. ఇందుకోసం సదరు వ్యక్తుల నేపథ్యం, ప్రవృత్తి వంటివన్నీ పరిశీలించి.. అన్నిరకాలుగా పరీక్షించి డ్రైవర్ గా డ్యూటీలోకి తీసుకుంటారు. ఈ అంశాల కారణంగానే.. సదరు డ్రైవర్లకు భారీ స్థాయిలో వేతనాలు చెల్లిస్తుంటారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇండియాలోనే ఉన్నానా ?? నమ్మలేకపోయిన జపాన్ టూరిస్ట్
బంగారంతో పాటు ఇతర ఖనిజాలను.. ఎలా వెలికితీస్తారో తెలుసా ??
ఒమేగా 3 కోసం చేపలే తినక్కరలేదు.. శాఖాహారంలో వీటిని ట్రై చేయండి !!
మిమ్మల్ని యంగ్ గా ఉంచే మ్యాజిక్ టీ.. ఈ పూలతో చేసే టీ తాగితే నిత్య యవ్వనం !!
టీపొడిని కూడా వదలరేంట్రా !! నకిలీ టీపొడిలో ఏమేం కలుపుతారో తెలుసా ??
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం
జిమ్ చేస్తూ చూపు కోల్పోయిన యువకుడు..! కారణం తెలిస్తే షాక్

