AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Made In India Video Games: వీడియో గేమర్స్ మనస్సు దోచుకున్న నయా గేమ్స్.. ఆ రంగంలో పెరుగుతున్న భారతీయ హవా

ఆటలంటే మనస్సుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి. అలాగే శరీరానికి సంబంధించిన వ్యాయామం ఆటలతో చేయవచ్చు. అయితే పెరిగిన టెక్నాలజీ నేపథ్యంలో ఇటీవల వీడియో గేమ్స్ అత్యంత ప్రజాదరణ పొందుతున్నాయి. ఇటీవల కాలంలో భారతీయ వీడియో గేమ్స్ అందరినీ ఆకర్షిస్తున్నాయి. తాజాగా విడుదలైన రెండు గేమ్స్ రికార్డులను సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మేడ్ ఇన్ ఇండియా వీడియో గేమ్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Made In India Video Games: వీడియో గేమర్స్ మనస్సు దోచుకున్న నయా గేమ్స్.. ఆ రంగంలో పెరుగుతున్న భారతీయ హవా
Indus Battle Royale
Nikhil
|

Updated on: Nov 24, 2024 | 4:52 PM

Share

ఇటీవల కాలంలో ఎక్కువ స్వదేశీ కంపెనీలు అధిక-నాణ్యత, భారీ-బడ్జెట్‌తో గేమ్స్‌ను రూపొందించడం వల్ల భారతీయ గేమింగ్ ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా గట్టి పోటీనిస్తుంది. అందువల్ల భారతీయ గేమ్ డెవలపర్‌లు సాధారణ గేమ్‌లను అందించే స్టూడియోల ఫోకస్ ఏరియాలో పెద్ద మార్పును వచ్చింది. గత నెలలోనే రెండు హై-ప్రొఫైల్, హెవీ-బడ్జెట్ (సాంకేతికంగా ఏఏఏ అని పిలుస్తారు) గేమ్‌లను ప్రారంభించింది. ఇండస్ బాటిల్ రాయల్, రేజ్ ఎఫెక్ట్ మొబైల్.  ఇండస్ బాటిల్ రాయల్ అనేది ఒక యుద్ధ రాయల్ గేమ్ అక్టోబర్ 16న విడుదలైనప్పటి నుంచి ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫారమ్‌లలో దాదాపు 5 మిలియన్ డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. రెండోది ఏఏఏ షూటర్ గేమ్ దాని ఓపెన్ బీటా వెర్షన్‌లో 120,000 ప్రీ-రిజిస్ట్రేషన్‌లను దాటింది. ఈ ఆదరణపై ఇండస్ బాటిల్ రాయల్ సృష్టికర్త అయిన సూపర్ గేమింగ్ సీఈఓ రాబీ జాన్ మాట్లాడుతూ రూ. 2.5 కోట్ల ప్రైజ్ పూల్‌తో ఏడాది పొడవునా ఎస్పోర్ట్స్ టోర్నమెంట్‌ని ప్రకటించామని, ఇది భారతదేశంలో రాబోయే గేమింగ్ టాలెంట్‌లకు మద్దతు ఇవ్వడానికి  రూపొందిచామని పేర్కొన్నారు. 

ఇండస్ బాటిల్ రాయల్‌ గేమ్‌ను సూపర్ గేమింగ్‌లో 160 మంది వ్యక్తుల బృందం అభివృద్ధి చేసింది. ఈ ప్రాజెక్ట్ బందాయ్ నామ్‌కో, అకాట్సుకి ఎంటర్‌టైన్‌మెంట్, స్కైక్యాచర్, వన్ అప్ వెంచర్స్ వంటి ప్రముఖ పెట్టుబడిదారుల నుంచి గణనీయమైన పెట్టుబడి రాబట్టిందని జాన్ తెలిపారు. భారతీయ సినిమాలు సాంస్కృతిక సాఫ్ట్ పవర్‌గా పని చేసినట్లే భారతీయ ఆటలు కూడా ఆ స్థాయికి ఎదుగుతాయని ఆయన స్పష్టం చేశారు. అలాగే డామినేషన్-ఇండియాలో తయారు చేసిన ఫస్ట్-పర్సన్ షూటర్ గేమ్ వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ గేమ్ విడుదలకు ముందే గేమర్ల దృష్టిని ఆకర్షిస్తుంది. గురుగ్రామ్, ముంబైలో ఇటీవల నిర్వహించిన ప్లేటెస్ట్‌లు, హైదరాబాద్‌లో జరిగిన ఇండియన్ గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్‌లో దాదాపు 90 శాతం గేమర్లు భారతీయ సైనిక థీమ్‌లతో వచ్చే ఆటలను ఇష్టపడ్డారు. అయితే 70 శాతం మంది గేమ్‌ప్లే తమ అంచనాలను మించిపోయిందని చెప్పారు.

భారతదేశ థీమ్స్‌తో వస్తున్న ఆటలపై గేమర్లు ఆసక్తి చూపుతుండడం వల్ల దేశీయ స్టూడియోలు పెద్ద ఎత్తున పెట్టుబడులను పొందాయి. అందువల్ల నాణ్యతతో గేమ్‌లను అభివృద్ధి చేయడం ప్రారంభించాయి. ముఖ్యంగా ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఈ గేమ్స్‌ను రూపొందిస్తున్నారు. స్వదేశీ హెడ్డింగ్స్‌తో వచ్చే వీడియో గేమ్స్ అభివృద్ధి ఇప్పుడు మరింత భారతీయ డెవలపర్‌లు, స్టూడియోలు అధిక-నాణ్యత, ప్రపంచ స్థాయి గేమ్‌లపై పని చేయడానికి దారి తీస్తుందని ముంబైకి చెందిన గేమింగ్ స్టూడియో, 250కి పైగా గేమ్‌ల సృష్టికర్త అయిన అండర్ డాగ్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ వైభవ్ చవాన్ అన్నారు. ముఖ్యంగా గత ఐదేళ్లల్లోనే అందరి అంచనాలు తిరగరాస్తూ భారత గేమింగ్ పరిశ్రమ వృద్ధి చెందిందని ఆయన స్పష్టం చేశారు. అండర్‌డాగ్స్ ప్రస్తుతం ముక్తికి సంబంధించిన పూర్తి స్థాయి ఉత్పత్తిలో నిమగ్నమై ఉందని, ఇది ఇండియా హీరో ప్రాజెక్ట్‌ను గెలుచుకున్న ఫస్ట్-పర్సన్ స్టోరీ ఎక్స్‌ప్లోరేషన్ గేమ్ అని ఆయన చెప్పారు. భారతదేశంలో నిర్వహిస్తున్న గేమ్ డెవలప్‌మెంట్ స్టూడియోలకు నిర్వహణ ఖర్చులు సంవత్సరానికి 1-2 మిలియన్ల డాలర్లుగా గా ఉన్నాయని అలీ ఆఫ్ డాట్9 గేమ్స్ తెలిపింది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి