- Telugu News Photo Gallery Business photos Hats off to the uniqueness of indian currency notes, Special methods of preparation, Indian currency details in telugu
Indian currency: మన కరెన్సీ నోట్ల ప్రత్యేకతకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. తయారీకు ప్రత్యేక పద్ధతులు
భారతీయ కరెన్సీ నోట్లకు చాలా ప్రత్యేకత ఉంది. ఇవి ఎంతో మన్నికగా ఉంటాయి. అలాగే భద్రత, నకిలీల నిరోధానికి ప్రత్యేక పదార్థాలతో తయారు చేస్తారు. సాధారణ కాగితం మాదిరిగా కనిపించినప్పటికీ అద్బుత నైపుణ్యం దాగి ఉంది. నోట్ల ముద్రణ కోసం ఉపయోగించే కాగితాన్ని వంద శాతం పత్తితో తయారు చేస్తారు. దీనివల్ల నోటుకు మంచి ఆకారం రావడంతో పాటు మన్నిక బాగుంటుంది. ఎక్కువ కాలం చెలామణిలో ఉన్నా చిరిగిపోకుండా ఉంటుంది. ప్రత్యేక మైన ఆకారం కారణంగా నకిలీల బెడద ఉండదు. పూర్తి స్థాయిలో భద్రత లభిస్తుంది.
Updated on: Nov 24, 2024 | 8:59 PM

కరెన్సీ నోటులో సిల్వర్ కలర్డ్ సెక్యూరిటీ థ్రెడ్ ను పొందుపరిచారు. ఇది మెషీన్ రీడబుల్ థ్రెడ్ రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ముద్ర, గవర్నర్ సంతకం కనిపిస్తాయి. నోటు ప్రామాణికతను ఇవి కీలక గుర్తులు.

కాంతికి వ్యతిరేకంగా నోటును పట్టుకున్న డిజైన్ సక్రమంగా కనిపిస్తుంది. నోట్ ను వెలుగులో చూసినప్పుడు ఎలక్ట్రో టైప్ వాటర్ మార్కులు కనిపిస్తాయి. మాగ్నిఫికేషన్ కింద చిన్న శాసనాలను చూడవచ్చు.

నోట్ లోని సంఖ్యలు రంగు మారే ఇంక్ తో ముద్రిస్తారు. నోట్ ను ప్లాట్ గా చూస్తే ఆకు పచ్చగా, ఒంపుగా చూస్తే నీలం రంగులోకి మారతాయి.


25 సెక్షన్ ప్రకారం ఆర్బీఐ సెంట్రల్ బోర్డు నుంచి సిఫారసులను తీసుకున్న తర్వాత ఈ నోట్ల రూపకల్పనకు మెటీరియల్ ను కేంద్రం ఖరారు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం, ఇతర వాటాదారులతో సంప్రదించి డినామినేషన్ల ద్వారా బ్యాంకునోట్ల వార్షిక అవసరాన్ని అంచనా వేస్తుంది.




