JioStar: ఓటీటీలో జియో సంచలనం.. రూ. 15 నుంచి జియో స్టార్ సేవలు..
ఇప్పటి వరకు జియో సినిమాకు ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్స్ ఉంటే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కు 500 మిలియన్ల డౌన్‌లోడ్స్ ఉన్నాయి. జియో స్టార్‌లో టీడీ ఛానల్స్ కూడా అందుబాటులో వచ్చాయి. ఇందులో భాగంగా జియోస్టార్ కొత్త వెబ్‌సైట్‌ను లాంచ్ చేసింది....
దేశీయ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో అతిపెద్ద వీలినం పూర్తి అయ్యింది. జియో వయాకామ్ 18, డిస్నీ హాట్‌స్టార్ విలీనం పూర్తయింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు పోటీనిచ్చేలా జియో ఈ కొత్త సేవలను ప్రారంభించింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జియో సినిమా రెండూ విలీనమై జియో స్టార్ పేరుతో ప్రారంభమవయ్యాయి.
ఇప్పటి వరకు జియో సినిమాకు ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్స్ ఉంటే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కు 500 మిలియన్ల డౌన్‌లోడ్స్ ఉన్నాయి. జియో స్టార్‌లో టీడీ ఛానల్స్ కూడా అందుబాటులో వచ్చాయి. ఇందులో భాగంగా జియోస్టార్ కొత్త వెబ్‌సైట్‌ను లాంచ్ చేసింది. జియో స్టార్ వెబ్‌సైట్‌లో రకరాల ప్యాక్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు.
స్టాండర్డ్ డెఫినేషన్, హై డెఫినినేషన్ పేరుతో రెండు విభాగాల్లో ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. తెలుగు సహా అన్ని ఛానల్స్ ఇందులో ఉన్నాయి. వీటిలో రూ. 15 నుంచే ప్యాక్‌లు అందుబాటులో ఉండడం విశేషం. రిలయన్స్ జియో, డిస్నీ హాట్ స్టార్ విలీనం తర్వాత, రిలయన్స్ ఇండస్ట్రీస్ జియోస్టార్.కామ్‌లో 46.82 శాతం వాటాను కలిగి ఉండగా, హాట్‌స్టార్‌కు 36.84 శాతం, వయాకామ్ 18కి 16.34 శాతం వాటా ఉంది. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటీటీ సంస్థలకు పోటీనిచ్చే క్రమంలో తీసుకొచ్చిన జియోస్టార్ ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.
ఇక ప్యాకేజీ ధర విషయానికొస్తే.. స్టార్ వాల్యు ప్యాక్ తెలుగు నెలకు రూ. 59తో ప్రారంభమవుతుంది. అదే విధంగా.. స్టార్ వాల్యూ ప్యాక్ తెలుగు హిందీ నెలకు రూ. 81, స్టార్ వాల్యూ ప్యాక్ హిందీ తెలుగు: నెలకు రూ. 81, స్టార్ వాల్యూ ప్యాక్ తెలుగు హిందీ మినీ: నెలకు రూ. 70గా నిర్ణయించారు. వీటితో పాటు అన్ని భాషల్లో వేరువేరుగా ప్యాకేజీ ధరలను ఫైనల్ చేశారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..