Rishabh Pant IPL Auction 2025: రికార్డు బద్దలు.. ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్.. ఏ జట్టు కొన్నదంటే?

Rishabh Pant IPL 2025 Auction Price: అనుకున్నట్లే జరిగింది. ఐపీఎల్ మెగా వేలంలో టీమిండియా వికెట్ కీపర్ అండ్ బ్యాటర్ రిషభ్ పంత్ పై కాసుల వర్షం కురిసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డుల కెక్కాడు. ఢిల్లీ పంత్ ను మళ్లీ కొనుగోలు చేస్తుందని ప్రచారం జరిగినా అది జరగలేదు.

Rishabh Pant IPL Auction 2025: రికార్డు బద్దలు.. ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్.. ఏ జట్టు కొన్నదంటే?
Rishabh Pant
Follow us
Basha Shek

|

Updated on: Nov 24, 2024 | 5:00 PM

ఐపీఎల్ మెగా వేలం-2025లో రిషబ్ పంత్ పైనే అందరి దృష్టి నిలిచింది. ఈ స్టార్ బ్యాటర్ అండ్ వికెట్ కీపర్ ను దక్కించుకోవడానికి అన్ని ఫ్రాంఛైజీలు పోటీ పడ్డాయి. రిషబ్ పంత్ కు వందకు పైగా ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ఆడిన అనుభవం ఉంది. అలాగే వేలాది పరుగులు కూడా సాధించాడు. ఇక యాక్సిడెంట్ తర్వాత మరింత రెచ్చిపోతున్నాడు పంత్. ఇదే క్రమంలో ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని రిటైన్ చేయనప్పుడు.. వేలంలో పంత్‌పై కోట్లాది రూపాయల వర్షం కురుస్తుందని అందరూ భావించారు. ఇప్పుడు అదే జరిగింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయాడు రిషభ్ పంత్. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మాత్రం కాదు. లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ అతనిని 27 కోట్లకు సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ఐపీఎల్ హిస్టరీలో ఇదే భారీ బిడ్డింగ్.

2016 నుంచి ఐపీఎల్‌లో ఢిల్లీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు పంత్. 2016, 2017, 2018లో మూడు ఐపీఎల్‌లలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరపున ఆడాడీ స్టారప్లేయర్. ఆ తర్వాత 2019లో ఢిల్లీ జట్టు పేరు ఢిల్లీ క్యాపిటల్స్ గా మారింది. ఆ తర్వాత పంత్‌కి 2021లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్సీ కూడా లభించింది. అదే సమయంలో గాయం కారణంగా శ్రేయాస్ అయ్యర్ కూడా టోర్నీకి దూరమయ్యాడు. ఈక్రమంలో పంత్ సారథ్యంలోని డీసీ జట్టు ప్లే ఆఫ్ కు చేరుకుంది. అయితే ఢిల్లీ ఎప్పుడూ ఐపీఎల్ ట్రోఫీని గెలవలేదు. 111 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి న పంత్ మొత్తం 3284 పరుగులు చేశాడు. 1 సెంచరీ, 18 హాఫ్ సెంచరీలు చేశాడు. ఢిల్లీ జట్టుతో తన 8 ఏళ్ల బంధాన్ని ఈసారి పంత్ ముగించాడు. ఈసారి లక్నో జట్టులో రిషబ్ ఏ అధ్యాయం రాస్తాడోనని అతని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

లక్నో జట్టుకు రిషబ్ పంత్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..