Pushpa 2: పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తోన్న చిత్రం పుష్ప 2 ది రూల్. మూడేళ్ల క్రితం రిలీజై బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టిన పుష్ప ది రైజ్ సినిమాకు ఇది సీక్వెల్. ఇక ఇప్పటికే పలు సార్లు వాయిదా పడిన పుష్ప 2 సినిమా ఎట్టకేలకు డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ముమ్మరం చేశారు మేకర్స్.
ఇటీవలే బిహార్ వేదికగా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ తో పాటు ట్రైలర్‌తో పుష్ప 2 సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. అయితే ఎప్పట్లాగానే ఈ పాన్ ఇండియా సినిమా రిలీజ్ పై ఏదో ఒక ప్రచారం వినిపిస్తూనే ఉంది. అలా తాజాగా పుష్ప 2 సినిమా మళ్లీ వాయిదా పడింది అంటూ తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే ఈ తప్పుడు ప్రచారంపై పుష్ప టీమ్ రియాక్టైంది. సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసింది.
పుష్ప మూవీలో అల్లు అర్జున్ మేనరిజం వీడియో జిఫ్‌ను షేర్ చేసి పుష్ప2 టీం.. దానికి కిందే క్లారిటీ ఇచ్చింది. డిసెంబర్ 5.. అస్సలు తగ్గేదేలే అనే ఆ జిఫ్ వీడియో క్లిప్‌కు క్యాప్షన్ జోడించింది. దీంతో అనుకున్న తేదీకే అల్లు అర్జున్ మూవీ రానున్నట్లు మరో సారి పక్కా క్లారిటీ ఇచ్చేసింది పుష్ప2 టీం. ఇక అంతకు ముందే డిసెంబర్ 4న USA ప్రీమియర్స్ పడతాయని మేకర్స్ తెలిపారు. ‘పుష్ప’ మొదటి భాగం తర్వాత చాలా గ్యాప్ తర్వాత సుకుమార్, బన్నీ ‘పుష్ప 2’తో రాబోతున్నాడు. దీంతో ఈ సినిమా పై స్కై హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ఆంటీ అని పిలిచినందుకు.. మేల్ నర్స్‌కు జరిమానా
నేపాల్‌లో గుట్కా ఉమ్మిన భారతీయులు.. నీళ్లు పోసి కడిగించిన వీడియో
ప్రేతాత్మ తిరుగుతోందంటూ కాలేజీలో పూజలు
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్

