Tollywood: 'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్..

Tollywood: ‘మీరు మాత్రం క్షమించకండి సార్’.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్..

Anil kumar poka

|

Updated on: Nov 24, 2024 | 4:10 PM

ప్రముఖ సినీ నటుడు, వైసీపీ కీలక నేత పోసాని కృష్ణమురళి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటానని ప్రకటించారు. ఏ పార్టీనీ పొగడనని, ఏ పార్టీనీ తిట్టనని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పుకొచ్చారు. రాజకీయాల కారణంగా తన ఫ్యామిలీకి తగిన సమయం ఇవ్వలేకపోతున్నానని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. అయితే పోసాని నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన చంద్రబాబు, పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ కారణంగా పోసానిపై చాలా చోట్ల పోలీస్ కేసులు నమోదయ్యాయి. ఆయనను అరెస్ట్ చేయవచ్చనే ఊహాగానాలు వినిపించాయి. అయితే ఇంతలోనే రాజకీయాలను వదిలేస్తున్నట్లు ప్రకటించారు పోసాని. ఇక ఈ నిర్ణయంపై ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, బేబీ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక సంచలన పోస్ట్ పెట్టారు.

గతంలో పవన్ కల్యాణ్, ఆయన కుటుంబ సభ్యులను ఉద్దేశించి.. పోసాని చేసిన వ్యాఖ్యల వీడియోను షేర్ చేసిన ఎస్కేఎన్.. సార్, ఇప్పుడు అందరికీ అన్ని గుర్తొస్తాయి. కానీ విరమిస్తున్నా అని నటించే ముందు.. కనీసం మీరు మా అభిమాన నాయకుడి గురించి, ముఖ్యంగా ఇంట్లోని పసి పిల్లల గురించి మాట్లాడిన నీచమైన సంస్కారం లేని లేకి వాఖ్యలకి చింతిస్తున్నా లేదా క్షమించండి అని అడిగి ఉంటే.. మీ మాటలు నమ్మాలనిపించేదంటూ ట్వీట్ చేశాడు.

అంతేకాదు ఏదో ఒకసారి పొరపాటుగా మాట్లాడిన వ్యక్తి కాదు మీరు… ఎన్నోసార్లు ఎంతో నీచంగా మాట్లాడారు. అభిమానుల మనసును చాలా అంటే చాలా బాధ పెట్టారు. ఛీ ఇవేం మాటలు అని చెవులు మూసుకొనేలా చేశారు అంటూ ఎస్కేఎన్ తన ట్వీట్లో రాసుకొచ్చాడు. మీదే కాదు అందరివీ కుటుంబాలే… రాజకీయాల్లో విమర్శలు సహజం కానీ వ్యక్తిగతం గా దిగజారుడు పదాలతో కుటుంబాల మీద కామెంట్స్ చేసిన వారు మాత్రం క్షమార్హులు కాదంటూ ఎస్కేఎన్ తన ట్వీట్‌ను ముగించాడు. అయితే ప్రస్తుతం ఈయన చేసిన ట్వీట్‌ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.