డయాబెటిస్ రోగులకు అమృతం.. ఉదయాన్నే ఈ పండు తింటే అద్భుతమే.. మిస్ అవ్వొద్దు..

డయాబెటిస్ ఉన్నవారు వెనకాముందు ఆలోచించిన తర్వాత మాత్రమే ఆహారం తీసుకుంటారు. ఎందుకంటే.. ఏ ఆహారం రక్తంలో చక్కెరను పెంచుతుందోనని భయపడుతుంటారు.. అయితే.. పండ్లు ఆరోగ్యానికి మంచివి అయినప్పటికీ.. రక్తంలో చక్కెరను పెంచే అనేకం ఉన్నాయి. కానీ కొన్ని పండ్లు మధుమేహ వ్యాధిగ్రస్తులకు దివ్యౌషధంలా పనిచేస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ శీతాకాలపు పండును తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని పేర్కొంటున్నారు..

డయాబెటిస్ రోగులకు అమృతం.. ఉదయాన్నే ఈ పండు తింటే అద్భుతమే.. మిస్ అవ్వొద్దు..
Diabetes
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 24, 2024 | 5:05 PM

ప్రస్తుత కాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలా మంది మధుమేహం బారిన పడుతున్నారు.. అయితే.. డయాబెటిక్ రోగులు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే రక్తంలో చక్కెర పరిమాణం పెరిగి ఆరోగ్యం దెబ్బతింటుంది.. మధుమేహ వ్యాధిగ్రస్తులు పీచుపదార్థాలు అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. మీరు మీ ఆహారంలో ఎక్కువ పండ్లు.. కూరగాయలను చేర్చుకోవాలి. అయితే డయాబెటిస్‌లో ఏ పండ్లు, కూరగాయలు తినాలి? ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని పండ్లు తినడం వల్ల డయాబెటిక్ పేషెంట్లలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అందువల్ల పీచుపదార్థాలు, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పండ్లు తినాలని వైద్యులు సూచిస్తున్నారు.

ముఖ్యంగా శీతాకాలంలో జామ పండ్లు బాగా దొరుకుతాయి.. అందుకే.. దీన్ని శీతాకాలపు పండు అంటారు.. జామపండులో ఎన్నో పోషకాలున్నాయి.. అయితే, డయాబెటిస్‌లో జామపండు తినవచ్చో లేదోనని చాలా మంది డయాబెటిక్ రోగులు సందేహపడుతుంటారు.. జామపండు తింటే రక్తంలో చక్కెర పెరుగుతుందా? జామపండు తినగలిగితే ఎంత తినవచ్చు? అని ప్రశ్నిస్తుంటారు..

డయాబెటిస్ లో జామపండు తినోచ్చో లేదో ఇప్పుడు తెలుసుకోండి..

పోషకాల పరంగా యాపిల్ కంటే జామ పండు గొప్పది. జామపండు వల్ల కలిగే ప్రయోజనాల కారణంగా దీనిని సంస్కృతంలో ‘అమృత’ అని కూడా అంటారు. శీతాకాలంలో తాజా-తీపి జామపండ్ల సీజన్ ప్రారంభమవుతుంది.. మీరు రోజూ 1 జామపండు తింటే ఎన్నో పోషకాలు అందుతాయి.. అయితే.. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా జామపండు ప్రయోజనకరమైన పండు. జామ మాత్రమే కాదు, దాని ఆకులు మధుమేహానికి కూడా మేలు చేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

డయాబెటిస్‌లో జామపండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం.. జామ గ్లైసెమిక్ సూచిక 12-24 మధ్య ఉంటుంది.. దీనిలో చాలా తక్కువగా ఉంటుంది.. జామపండులో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే అనేక విటమిన్లు ఉంటాయి. జామలో విటమిన్ సి, ఫైబర్, ఐరన్, పొటాషియం, లైకోపీన్, యాంటీ-ఆక్సిడెంట్లు ఉన్నాయి.. ఇవి రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా, జామపండు తినడం వల్ల బరువు తగ్గుతుంది. శరీరంలో ఇన్సులిన్ నిరోధకత మెరుగుపడుతుంది.

జామపండు ఎప్పుడు తినాలి?

డయాబెటిక్ పేషెంట్లు రోజులో 1 పెద్ద జామపండు తినవచ్చు. అల్పాహారంలో జామపండు తినడం చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు.. ఇది రోజంతా రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. జామపండును ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం వల్ల కడుపు, జీర్ణ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. ఇది మలబద్ధకం నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. జామపండు తినడం వల్ల ఊబకాయం కూడా తగ్గుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి