ఆయుర్వేద దివ్యౌషధం.. ఈ ఒక్క టీ తో ఆ సమస్యలన్నీ పరార్.. బోలెడన్ని ప్రయోజనాలు..

దాల్చిన చెక్కలో ఎన్నో ఔషధ గుణాలు, పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.. దాల్చిన చెక్క రుచిని ఇష్టపడని వారంటూ ఉండరు.. దాని సహాయంతో అనేక వంటకాల రుచి పెరుగుతుంది. ఈ గరం మసాలాలో కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.

ఆయుర్వేద దివ్యౌషధం.. ఈ ఒక్క టీ తో ఆ సమస్యలన్నీ పరార్.. బోలెడన్ని ప్రయోజనాలు..
Benefits Of Cinnamon Water
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 24, 2024 | 2:59 PM

దాల్చిన చెక్కలో ఎన్నో ఔషధ గుణాలు, పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.. దాల్చిన చెక్క రుచిని ఇష్టపడని వారంటూ ఉండరు.. దాని సహాయంతో అనేక వంటకాల రుచి పెరుగుతుంది. ఈ గరం మసాలాలో కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. అందుకే దాల్చిన చెక్కను తీసుకోవాలంటూ ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.. ఒకవేళ ఆహారంలో తీసుకోకపోయినా.. వేడినేటిలో దాల్చిన చెక్కను మరిగించి లేదా.. దాల్చిన చెక్క పొడిని వేడి నీటిలో కలుపుకుని టీ లాగా తాగితే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మనం రోజూ ఒక గ్లాసు దాల్చినచెక్క నీరు తాగితే మన ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి..

దాల్చిన చెక్క నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు

జీర్ణక్రియ మెరుగుపడుతుంది: దాల్చినచెక్కలో సహజమైన జీర్ణక్రియ లక్షణాలు కనిపిస్తాయి.. ఇది జీర్ణవ్యవస్థను మెరుగ్గా నిర్వహించడానికి సహాయపడుతుంది. దాల్చిన చెక్క నీటిని రోజూ తాగడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు చాలా వరకు నయమవుతాయి.

జ్ఞాపకశక్తి బలపడుతుంది (మెమరీ బూస్ట్): మీరు రోజూ దాల్చిన చెక్క నీటిని తాగితే.. అది మీ మెదడు పనితీరు మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. ఇది మీ ఏకాగ్రతను పెంచుతుంది.. ఇంకా మీ జ్ఞాపకశక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు.

గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది: దాల్చిన చెక్క నీటిని క్రమం తప్పకుండా తాగే వారి సిరల్లో చెడు కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును నిర్వహించడానికి సహాయపడుతుంది. అటువంటి పరిస్థితిలో, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంకా గుండెపోటు వంటి తీవ్రమైన వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది : యాంటీ మైక్రోబియల్, యాంటీ వైరల్ లక్షణాలు దాల్చిన చెక్కలో పుష్కలంగా ఉన్నాయి. ఇది మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది జలుబు, దగ్గు, ఫ్లూ, జ్వరం వంటి వైరల్ వ్యాధుల ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది.

చర్మానికి మేలు చేస్తుంది: దాల్చిన చెక్క నీరు చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.. మంటను తగ్గించడం, ఆరోగ్యకరమైన ఛాయను ప్రోత్సహించడం ద్వారా చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మొటిమలతోపాటు అనేక చర్మ సమస్యలను దూరం చేస్తుంది.

దాల్చిన చెక్క టీ కోసం ముందుగా నీటిని ఓ గిన్నెలో తీసుకోవాలి.. ఆ తర్వాత కొంచెం దాల్చిన చెక్క లేదా పొడి వేసి బాగా మరగించాలి.. అనంతరం వడపోసుకుని తాగాలి.. రుచికి తగినట్లు నిమ్మరసం లేదా తేనెను కలుపుకోవచ్చు..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ