Sorry Expression: సారీ.. మోసం చేయలేదు.. అక్కడ ఏ గల్లీ చూసినా అదే పోస్టర్.. అసలు కథ ఏంటంటే..
Sorry Expression: ‘‘సారీ.. మోసం చేయలేదు’’ ఈ పదం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా రాజమండ్రిలో హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే.. రాజమండ్రిలో ఎటు చూసినా..
Sorry Expression: ‘‘సారీ.. మోసం చేయలేదు’’ ఈ పదం ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే.. రాజమండ్రిలో ఎటు చూసినా ‘సారీ.. మోసం చేయలేదు’ అనే పోస్టర్లే దర్శనం ఇస్తున్నాడు. ఏ గోడ చూసినా అదే పోస్టర్.. ఏ చెట్టు చూసినా అదే పోస్టర్ కనిపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని ఏవీ అప్పారావు రోడ్.. దానవాయిపేట, ఏకేసీ రోడ్ పరిసర ప్రాంతాల్లో గోడలు, ఖాళీ ప్రదేశాలపై ‘సారీ.. మోసం చేయలేదు’ అని రాసి ఉన్న పోస్టర్లు దర్శనం ఇస్తున్నాయి. ఆ పోస్టర్‌లో సాడ్ సింబల్ కూడా ఉంది. వీటిని చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఏంది కథ అని సందేహం వయక్తం చేస్తున్నారు. ఈ ఎందుకు సారీ? ఎవరికి సారీ? ఎవరు మోసం చేశారు? ఎవరిని మోసం చేయలేదు? అని స్థానికులు బుర్ర గీక్కుంటున్నారు.
నగరంలో ఏ గల్లీ చూసినా ఇదే పోస్టర్ కనిపిస్తుండటంతో.. సాడ్ సింబల్ మాటునున్న షాడో ఎవరు? ప్రియుడు ప్రియురాలిని మోసం చేయలేదా? భర్త.. భార్యను మోసం చేయలేదా? నాయకుడు.. ఓటర్లను మోసం చేయలేదా? వ్యాపారి కస్టమర్లను మోసం చేయలేదా? అసలేంటి మ్యాటర్ అంటూ జనాలు తమలో తామే ప్రశ్నించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే.. ప్రేమికుల మధ్య గొడవ నేపథ్యంలో ఎవరైనా ఇలా పోస్టర్లు అంటించారాని కొందరు అభిప్రాయపడుతుండగా.. ప్రియుడు తన ప్రియురాలికి ఇలా వినూత్నంగా క్షమాపణ చెప్పినట్లుగా భావిస్తున్నారు. ఇక రాజకీయంగా ప్రజల్ని మోసం చేసి ప్రజల కోసం మోసం చేయలేదు అని పెట్టారా? అన్న కోణంలోనూ మరికొందరు ఆలోచిస్తున్నారు.
మొత్తంగా రాజమహేంద్రవరంలో పలు చోట్ల ఓ అజ్ఞాత వ్యక్తి పెట్టిన ఈ వింత పోస్టర్స్ హల్చల్ చేస్తున్నాయి. సారి మోసం చెయ్యలేదు అంటూ.. సాడ్ సింబల్‌తో వేసిన పోస్టర్స్ పైనే ఇప్పుడు అందరి దృష్టి పడింది. యువకుడు ప్రేమ విఫలం అవడంతో తాను ప్రేమించిన అమ్మాయికి క్షమాపణ చెప్పడానికి ఈ యువకుడు కొత్త దారిని ఎంచుకున్నాడని అంటున్నారు యువకులు. దాదాపు రాజమహేంద్రవరంలో చాలా చోట్ల సారీ నేను నిన్ను మోసం చేయలేదు అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. దీంతో ఇప్పుడు రాజమహేంద్రవరంలో ఆ ఫ్లెక్సీలు హాట్ టాపిక్‌గా మారాయి.
ఒకరికి క్షమాపణ చెప్పాలి అంటే.. మొబైల్ లోనో.. మధ్య వర్తులతోనో చెప్పేవారు. కానీ, గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలా కూడా చెప్తారా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు రాజమండ్రి వాసులు. మరి ఇది ఓ భగ్న ప్రేమికుడు చేసిన వింత విన్యాసమా..? లేక ఓ ప్రేమికురాలు ప్రేమికుడిని చెప్తుందా..? లేక రాజకీయ నాయకుల ఎత్తులా? ఇలా అనేక కోణంలో ప్రశ్నలు వేల్లువెత్తున్నాయి. దీపావళి వేళ చర్చనీయాంశం అయిన ఈ ‘సారీ’ కథ ఏంటో, ఈ గోడ సందేశం అజ్ఞాత వ్యక్తి లక్ష్యాన్ని చేరుతుందో చూడాలి మరి.
Also read:
Stuartpuram Donga: గజ దొంగగా బెల్లంకొండ హీరో.. డిఫరెంట్ లుక్‌లో అదరగొట్టిన యంగ్ హీరో..