BJP: నవంబర్ 6, 7 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.. పాల్గొననున్న తెలుగు రాష్ట్రాల కీలక నేతలు..
BJP National Working Committee meeting: దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇటీవలనే ఉప ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ పార్టీకి
BJP National Working Committee meeting: దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇటీవలనే ఉప ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా బీజేపీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలో ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 6, 7 తేదీల్లో ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నట్లు బీజేపీ నేతలు పేర్కొన్నారు. 6న జాతీయ పదాధికారుల సమావేశం జరగనుంది. అనంతరం మరుసటి రోజు 7న బీజేపీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసినట్లు నేతలు పేర్కొన్నారు. అయితే.. కరోనా నేపథ్యంలో ఈ సమావేశానికి అతితక్కువ మందే నేరుగా పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. ఈ సమావేశాలు వర్చువల్ విధానంలో జరగనున్నాయి. ఆయా రాష్ట్రాల బీజేపీ నేతలంతా వర్చువల్ విధానంలో జరగనున్నాయి. తెలంగాణ నుండి బండి సంజయ్, వివేక్ వెంకటస్వామి, ఈటల రాజేందర్, రాజా సింగ్, విజయశాంతి, జితేందర్ రెడ్డి, గరికపాటి, ఏపీ నుంచి సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొననున్నారు. అయితే.. నేరుగా పాల్గొననున్న డీకే అరుణ, డా.లక్ష్మణ్, మురళిధర్ రావు పాల్గొననున్నట్లు బీజేపీ తెలిపింది.
కాగా.. జాతీయ కార్యవర్గ సమావేశంలో ముఖ్యంగా ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమి, అదేవిధంగా వచ్చే ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరగనున్నట్లు తెలుస్తుంది. ఉప ఎన్నికల్లో పలు రాష్ట్రాల్లో బీజేపీ ఓటమిపై అధిష్టానం ఆయా రాష్ట్రాల నుంచి సమాచారాన్ని సేకరించింది. పశ్చిమ బెంగాల్, కర్ణాటక, అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీకి ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే.
Also Read: