Chandrababu – TDP: అన్నీ రికార్డ్ చేస్తున్నాం.. ఏపీ సర్కార్, పోలీస్ వ్యవస్థపై చంద్రబాబు సంచలన కామెంట్స్..

Andhra Pradesh Politics: ఆంధ్రప్రదేశ్‌లో అరాచక, దుర్మార్గపు పాలన నడుస్తోందంటూ వైసీపీ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Chandrababu - TDP: అన్నీ రికార్డ్ చేస్తున్నాం.. ఏపీ సర్కార్, పోలీస్ వ్యవస్థపై చంద్రబాబు సంచలన కామెంట్స్..
Chandrababu Naidu
Shiva Prajapati

|

Nov 04, 2021 | 8:28 PM

Andhra Pradesh Politics: ఆంధ్రప్రదేశ్‌లో అరాచక, దుర్మార్గపు పాలన నడుస్తోందంటూ వైసీపీ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీపావళి రోజున స్థానిక ఎన్నికలు నిర్వహించడం ఏంటి? అని ప్రశ్నించారు. దీపావళి రోజున నిర్వహిస్తున్నట్లే.. క్రిస్ట్‌మస్ రోజున ఎన్నికలు నిర్వహిస్తారా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించారు. గురువారం నాడు ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్నికలు అత్యవసరంగా జరుపకపోతే కొంపలు ఏమైనా మునిగిపోతున్నాయా? అని ప్రశ్నించారు. హిందువుల పండుగ దీపావళి రోజున నామినేషన్లు ఎందుకు పెట్టారని ఆయన ప్రశ్నించారు. ఈ నిర్ణయాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గతంలో ఎన్నో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, రాష్ట్రాన్ని పిచ్చోళ్ళ రాష్ట్రంగా చేస్తారా? అంటూ వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. నామినేషన్ వేసే అభ్యర్థులను అధికార పార్టీకి చెందిన వారు బెదిరిస్తున్నారని, అనేక ఆటంకాలు సృష్టిస్తున్నారని అన్నారు. ఆర్వో లు డ్రామాలు ఆడితే.. జైలుకు వెళతారని, ఎక్కడున్నా కోలుకోలేని దెబ్బ తీస్తామని చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తమకే తెలియకుండా పోలీస్ కేసులు పెడుతున్నారని నిప్పులు చెరిగారు.

నామినేషన్ వేసే అభ్యర్థులు జాగ్రత్తలు తీసుకోవాలని తమ పార్టీ అభ్యర్థులకు చంద్రబాబు పలు సూచనలు చేశారు. ఎవరైనా బెదిరిస్తే రికార్డు చేయాలని సూచించారు. అధికార పార్టీకి చెందిన నేతలు ఆంబోతుల మాదిరిగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. సంఘ విద్రోహులు, వ్యతిరేక శక్తుల పని పడతామని అన్నారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, వీరు గెలిచే అవకాశం లేదని, భవిష్యత్ లో కూడా గెలవరని చంద్రబాబు పేర్కొన్నారు. పథకాలు, డబ్బుల పంపిణీ కూడా పని చేయదన్నారు.

ఇదిలాఉంటే.. పుంగనూరు మున్సిపల్ కమిషనర్ వైసీపీ‌కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయననే తీసుకువచ్చి కుప్పం మున్సిపల్ కమిషనర్‌గా వేశారని, పెద్దిరెద్దికి ఆయన తొత్తుగా పని చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు చంద్రబాబు. ‘ఖబడ్దార్ జాగ్రత్త.. ఎవరినీ వదిలిపెట్టేది లేదు’ అంటూ హూంకరించారు. తూటాలు, లాఠీ లకు భయపడేది లేదని, ఎన్నికల కమిషన్ ఏమి చేస్తుందో సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ‘‘జగన్ చెప్పినట్లు చేస్తే.. మీ అంతం ప్రారంభం అవుతుంది.’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

గురజాలలో నామినేషన్లు వేయకుండా వైసీపీ నాయకులు రౌడీయిజం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. గురజాలలో నామినేషన్లు వేస్తుంటే కుల ధ్రువీకరణ పత్రాలు లాక్కుని చించివేశారని అన్నారు. అధికారులు చేతకాకపోతే రాజీనామా చేయాలని అన్నారు. వైసీపీ వాళ్లు ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలంటూ చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ప్రజలు తిరగబడితే బట్టలు కూడా లేకుండా పరుగెత్తాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలిన వైసీపీ ప్రభుత్వానికి చంద్రబాబు సవాల్ విసిరారు. తమ పార్టీ కార్యాలయంపై ప్రభుత్వ ఉగ్రవాది దాడి జరిగిందంటూ చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వ పెద్దలతో డీజీపీ చేతులు కలిపారని, వారు చెప్పినట్లుగా ఆడుతున్నారని బాబు నిప్పులు చెరిగారు. డీజీపీ అండతోనే దాడులు జరిగాయని ఆరోపించారు. డీజీపీగా గౌతమ్ సవాంగ్ పనికిరారని, ప్రజలకు ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీలో గంజాయి, హెరాయిన్ స్మగ్లింగ్ జరుగడం లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ పోలీసులు ఆధారాలు ఇచ్చారని, ఆ రాష్ట్ర పోలీసులు ఏపీకి వచ్చి ఫైరింగ్ చేశారని పేర్కొన్నారు. ప్రతి రోజూ ఎక్కడోచోట గంజాయి పట్టుబడుతూనే ఉందని, ఆ లింకులు ఏపీలోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

ఇదే సమయంలో ఏపీలో పెట్రోల్, డీజిల్ రేట్లపైనా చంద్రబాబు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గించిందని, అనేక రాష్ట్రాలు కూడా తగ్గిస్తున్నాయని పేర్కొన్నారు. మరి ఏపీ సీఎం ఏం చేస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో చెత్త ప్రభుత్వం నడుస్తోందని, అందుకే చెత్తపైనా పన్ను విధిస్తున్నారంటూ ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. కుప్పంలో మొన్న జరిగిన ఎన్నికల్లో పదివేల మెజార్టీ వచ్చిందని, ఎవరూ ఏమీ చేయలేరని అన్నారు. ఎన్నికలు సక్రమంగా జరగకపోతే.. ఎన్నికల కమిషన్ దగ్గరకు, ఎన్నికలు జరిగే జిల్లాలకు తానే స్వయంగా వెళతానని ప్రకటించారు చంద్రబాబు. ఇప్పుడు జరిగిన ప్రతీ ఘటనను రికార్డ్ చేస్తున్నామని, తాము అధికారంలోకి రాగానే కమిషన్ వేసి.. ఎవరినీ వదిలిపెట్టకుండా చర్యలు తీసుకుంటామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో ఆల్ ఇండియా సర్వీసులు నిర్వీర్యం అయ్యిందని వ్యాఖ్యానించారు. జగన్‌తో జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా కావొద్దంటూ అధికారులను హెచ్చరించారు చంద్రబాబు.

Also read:

America Poison Frog: డ్రాగన్ కంట్రీ నుంచి తైవాన్‌ను కాపాడేందుకు అదిరిపోయే ప్లాన్ వేసిన అమెరికా.. అదేంటంటే..

WHO: కరోనా ముప్పు ఇంకా పొంచివుంది.. ఫిబ్రవరి నాటికి యూరప్‌లో 5 లక్షల మరణాలు: డబ్ల్యూహెచ్ఓ

Nabha Natesh: పరువాల పాల పిట్టలా మెరిసిన నభా నటేష్.. నండూరి ఎంకిలా ఇస్మార్ట్ బ్యూటీ..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu