Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

America Poison Frog: డ్రాగన్ కంట్రీ నుంచి తైవాన్‌ను కాపాడేందుకు అదిరిపోయే ప్లాన్ వేసిన అమెరికా.. అదేంటంటే..

America Poison Frog: సామ్రాజ్య విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న పోతున్న చైనా.. ఆ దిశగా మరింత దూకుడు పెంచింది. ఎప్పటి నుంచో తైవాన్‌పై కన్నేసిన డ్రాగన్ కంట్రీ..

America Poison Frog: డ్రాగన్ కంట్రీ నుంచి తైవాన్‌ను కాపాడేందుకు అదిరిపోయే ప్లాన్ వేసిన అమెరికా.. అదేంటంటే..
China Vs America
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 04, 2021 | 8:26 PM

America Poison Frog: సామ్రాజ్య విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న పోతున్న చైనా.. ఆ దిశగా మరింత దూకుడు పెంచింది. ఎప్పటి నుంచో తైవాన్‌పై కన్నేసిన డ్రాగన్ కంట్రీ.. ఆ దేశాన్ని ఆక్రమించేందుకు ముమ్మర ప్రయత్నలు చేస్తోంది. అయితే, చైనా నుంచి తైవాన్‌ను కాపాడటానికి అగ్రరాజ్యం అమెరికా సైతం తన ప్రయత్నాలు తాను చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటిక పకడ్బందీ వ్యూహాలు రచిస్తోన్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగానే ‘ది పాయిజన్ ఫ్రాగ్’ అనే ఫార్ములాను చైనాపై ప్రయోగించాలని అమెరికా యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తద్వారా తైవాన్‌ను అత్యంత సెక్యూరిటీ ఉన్న దేశంగా మార్చేయాలని ప్లాన్స్ వేస్తోంది అగ్రరాజ్యం.

వాస్తవ పరిస్థితులను బట్టి తైవాన్‌ను రక్షించాలంటే అమెరికాకు చాల తక్కువ మేరకు అవకాశాలు ఉన్నట్లు అమెరికా వ్యూహకర్తలు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే చైనాను ఎలాగైనా కట్టడి చేసేందుకు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని భావించారు. చైనా ఏమాత్రం దుస్సాహసానికి పాల్పడినా.. గట్టి ఝలక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇందులో బాగంగానే.. చైనాను కట్టడి చేయాలంటే ‘దిపాయిజన్ ఫ్రాగ్’ వ్యూహాం ఉత్తమం అని ఆ దేశ వ్యూహకర్తలు భావిస్తున్నారు.

ఇదిలాఉంటే.. తైవాన్‌పై కన్నేసిన డ్రాగన్ కంట్రీ.. ఆ దేశాన్ని ఎలాగైనా మింగేయాలని ఆవురావురుమంటోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల తైవాన్ ఎయిర్ డిఫెన్స్‌ జోన్‌లోకి చైనా యుద్ధ విమానాలు చొరబడ్డాయి. ఆ చొరబాట్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ చొరబాట్ల వెనుక చైనా ప్లాన్ వేరే ఉందని చెబుతున్నారు విశ్లేషకులు. తైవాన్‌కు చెందిన డాంగ్ షా ద్వీపాన్ని, ప్రాతాప్ ద్వీపాన్ని ఆక్రమించాలని చైనా భావిస్తోందట. కారణం.. అక్కడ తైవాన్ సైన్యం చాలా తక్కువగా ఉండటమే. ముందుగా ఈ ద్వీపాలను ఆక్రమించి.. ఆ తరువాత క్రమక్రమంగా తైవాన్ అంతటినీ తమ ఆధీనంలోకి తీసుకురావాలని కుయుక్తులు చేస్తోంది చైనా.

మరి చైనా కుట్రలను పసిగట్టిన అమెరికా ఊరుకుంటుందా. తైవాన్‌ను రక్షించేందుకు అవసరమైన చర్యలన్నీ చేపడుతోంది. అయితే, తైవాన్ సమీపంలో అమెరికాకు చెందిన యుద్ధ నౌకలు గానీ, సబ్ మెరైన్లు గానీ తగినన్ని లేవు. ఈ పరిణామం అమెరికాకు కాస్త క్లిష్టమే. ఈ నేపథ్యంలోనే ‘ది పాయిజన్ ఫ్రాగ్’ వ్యూహాన్ని తెరపైకి తీసుకువచ్చింది అగ్రరాజ్యం. దీనిలో భాగంగా.. డాంగ్ షా, ప్రతాప్ వంటి చిన్న ద్వీపాలను వీలైనంత టఫ్‌గా మార్చేసి కాపాడాలని భావిస్తోంది. డ్రాగన్‌ మింగటానికి వీలుకాని ‘విషపూరిత కప్ప’వలే తైవాన్‌ ద్వీపాలను మార్చాలని సూచించారు సెంటర్‌ ఫర్‌ న్యూ అమెరికా సెక్యూరిటీ వ్యూహాకర్తలు. ఇప్పటికే అమెరికా సైనికులు రహస్యంగా తైవాన్‌లో భద్రతా దళాలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారట. ఈ శిక్షణ.. అమెరికా వ్యూహానికి ఉపకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. తైవాన్ వంక చూడాలంటే చైనా హడలిపోయేలా ఈ వ్యూహం ఉంటుందని టాక్ వినిపిస్తోంది. మరి అగ్రరాజ్యం అమెరికా.. తైవాన్‌ను డ్రాగన్ చెర నుంచి ఎలా కాపాడుతుందో వేచి చూడాలి.

Also read:

Nabha Natesh: పరువాల పాల పిట్టలా మెరిసిన నభా నటేష్.. నండూరి ఎంకిలా ఇస్మార్ట్ బ్యూటీ..

Sorry Expression: సారీ.. మోసం చేయలేదు.. అక్కడ ఏ గల్లీ చూసినా అదే పోస్టర్.. అసలు కథ ఏంటంటే..

భారత్ వర్సెస్ పాక్ టెస్ట్ మ్యాచ్ జరగాల్సిందే.. లేదంటే టెస్ట్ ఛాంపియన్ షిప్‌కు అర్థమే లేదంటోన్న పాక్ దిగ్గజ ప్లేయర్లు