Stuartpuram Donga: గజ దొంగగా బెల్లంకొండ హీరో.. డిఫరెంట్ లుక్‌లో అదరగొట్టిన యంగ్ హీరో..
కుర్ర హీరో బెల్లం కొండ శ్రీనివాస్ హిట్ కోసం చాలా కష్టపడుతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న శ్రీనివాస్ సరైన హిట్ మాత్రం అందుకోలేక పోతున్నాడు.
Bellamkonda Srinivas: కుర్ర హీరో బెల్లం కొండ శ్రీనివాస్ హిట్ కోసం చాలా కష్టపడుతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న శ్రీనివాస్ సరైన హిట్ మాత్రం అందుకోలేక పోతున్నాడు. అయినా ప్రయత్నాన్ని ఆపకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ కుర్ర హీరో. చివరిగా అల్లుడు అదుర్స్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన బెల్లంకొండ ఇప్పుడు బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకోవడాని ట్రై చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తెలుగులో సూపర్ హిట్ గా నిలిచినా రాజమౌళి-ప్రభాస్ ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలు పెట్టేశాడు. ఈ సినిమాకు యాక్షన్ డైరెక్టర్ వి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు తెలుగులో ఓ సినిమా చేస్తున్న ఈ బెల్లంకొండ హీరో.
బెల్లం కొండ శ్రీనివాస్ హీరోగా స్టువర్ట్ పురం అనే సినిమా తెరకెక్కుతుంది. దీపావళి కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో పేరు మోసిన గజ దొంగగా కనిపించనున్నాడు బెల్లంకొండ. ఈ సినిమా చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు శ్రీనివాస్. రెండు రైఫిల్స్ ని చేతపట్టి అతడు కనిపించిన తీరుతోనే ఈ సినిమాలో అతని పాత్ర చాలా భయంకరం గా ఉంటుందని అర్ధమవుతుంది. ఈ పోస్టర్ ఆకట్టుకునేలా ఉన్నాయి. 1970 లలో స్టువర్ట్ పురంలో పేరుమోసిన దొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా ఈ సినిమా రాబోతుంది. పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన టైగర్ నాగేశ్వరరావు పేదల చేత దేవుడిగా కొలవబడ్డాడు. ఇదే కథతో ఇప్పుడు ఈ సినిమా రాబోతుందని తెలుస్తుంది. కెఎస్ దర్శకుడిగా ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. ప్రతిష్టాత్మక బ్యానర్ శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.
Bellamkondaమరిన్ని ఇక్కడ చదవండి :