AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adivi Sesh’s Major : అప్‌డేట్స్‌తో అంచనాలు పెంచేసిన యంగ్ హీరో.. ‘మేజర్’గా మెప్పిస్తానంటున్న అడివి శేష్..

అడివి శేష్ హీరోగా రాబోతోన్న మేజర్ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. దీపావళికి ముందు రోజు అప్డేట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు మేక‌ర్స్‌.

Adivi Sesh's Major : అప్‌డేట్స్‌తో అంచనాలు పెంచేసిన యంగ్ హీరో.. 'మేజర్'గా మెప్పిస్తానంటున్న అడివి శేష్..
Adivi Shesh
Rajeev Rayala
|

Updated on: Nov 04, 2021 | 7:19 PM

Share

Adivi Sesh’s Major : అడివి శేష్ హీరోగా రాబోతోన్న మేజర్ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. దీపావళికి ముందు రోజు అప్డేట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు మేక‌ర్స్‌. ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేస్తూ.. రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మూడు భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం మొత్తంగా 120 రోజుల పాటు షూటింగ్ జరుపుకుంది. 75 లొకేషన్లలో షూటింగ్ చేయగా.. ఎనిమిది సెట్లు ప్రత్యేకంగా నిర్మించారు. ఈ వీడియోలో అతని జర్ని, ప్రేమ అన్నీ చూపించారు. టీనేజ్ కుర్రాడి నుంచి ధైర్యసాహసాలు కలిగిన సైనికుడిగా మారిన జర్నీని చూపించారు. ఇప్పటి వరకు ఈ చిత్రంను విడుదల చేసిన ప్రతీ అప్డేట్ అంచనాలను మరింత పెంచింది. ఇప్పుడు ఈ వీడియోతో అందరి దృష్టిని ఆకర్షించారు.

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరెక్కిస్తున్నారు. 26/11 దాడుల్లో ఆయన చూపించిన తెగువ, ధైర్య సాహసాలు మాత్రమే కాకుండా ఆయన జీవితంలోని ప్రతీ ఒక్క ఘటనను చూపించబోతోన్నారు. ఆయన ఏ స్ఫూర్తితో జీవించారు.. ఎలా మరణించారు అనేవి అందరినీ కట్టిపడేసేలా చూపించనున్నారు. ఇది వరకు విడుదల చేసిన టీజర్‌లో మేజర్ ఉన్ని కృష్ణన్ బాల్యాన్ని చూపించారు. టీనేజ్ నుంచి ఆర్మీ ఆఫీసర్‌గా ఎదిగిన క్రమాన్ని చూపించారు. వార్ డ్రామాతో రాబోతోన్న ఈ సినిమా మీద టీజర్ అంచనాలు పెంచేసింది. శశి కిరణ్ తిక్కా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అడివి శేష్, శోబితా ధూళిపాళ్ల, సాయీ మంజ్రేకర్ నటిస్తున్నారు. హిందీ, తెలుగు, మళయాల భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. గతంలో అడివి శేష్ నటించిన క్షణం, గూఢచారి సినిమాలు మంచి విజయాలు సంధించడం తో ఈ సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుందని ఈ యంగ్ హీరో ధీమా వ్యక్తం చేస్తున్నారు. మేజర్ సినిమాతో శేష్ మరో హిట్ అందుకోవడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి మేజర్ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Sooryavanshi: ‘సూర్యవంశీ’లో ఎంఎస్ ధోని.. ఆసక్తి రేకిత్తిస్తోన్న గుల్షన్ గ్రోవర్ సీక్రెట్ పోస్ట్

Kalyan Dev’s Super Machi : లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ‘సూపర్ మచ్చి’.. ఆకట్టుకుంటున్న టీజర్

Rajinikanth’s Peddanna Review: చెల్లెలి కోసం అన్న పడే ఆరాటం ‘పెద్దన్న’

 

Follow Us
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
చంద్రముఖి చికెన్ ఫ్రై.. ఇలా చేస్తే ముక్క కూడా మిగలదు!
చంద్రముఖి చికెన్ ఫ్రై.. ఇలా చేస్తే ముక్క కూడా మిగలదు!
రేపే బడులు ప్రారంభం.. విద్యార్థులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
రేపే బడులు ప్రారంభం.. విద్యార్థులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
వాస్తు రహస్యం.. ఈ చిన్న మార్పు మీ ఇంటికి ఐశ్వర్యాన్ని తీసుకు..
వాస్తు రహస్యం.. ఈ చిన్న మార్పు మీ ఇంటికి ఐశ్వర్యాన్ని తీసుకు..
వచ్చే నెలలో అకౌంట్లోకి రూ.2 వేలు..! కేంద్రం గుడ్ న్యూస్..
వచ్చే నెలలో అకౌంట్లోకి రూ.2 వేలు..! కేంద్రం గుడ్ న్యూస్..