జేసీ ఇంటిపై ఎమ్మెల్యే ఫాలోవర్స్ దాడి.. తాడిపత్రిలో ముదిరిన సోషల్ మీడియా వార్.. అనంత పాలిటిక్స్‌లో హీట్

Rajesh Sharma

Rajesh Sharma |

Updated on: Dec 24, 2020 | 2:49 PM

అనంతపురం రాజకీయాల్లో ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యంగా తాడిపత్రిలో పాలక వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ శ్రేణుల మధ్య సోషల్ మీడియాలో పోరు తీవ్రమైంది. ఏకంగా...

జేసీ ఇంటిపై ఎమ్మెల్యే ఫాలోవర్స్ దాడి.. తాడిపత్రిలో ముదిరిన సోషల్ మీడియా వార్.. అనంత పాలిటిక్స్‌లో హీట్

Social media war in Tadipatri politics: అనంతపురం రాజకీయాల్లో ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యంగా తాడిపత్రిలో పాలక వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ శ్రేణుల మధ్య సోషల్ మీడియాలో పోరు తీవ్రమైంది. ఏకంగా ఎమ్మెల్యే పెద్దారెడ్డి భార్యకు వ్యతిరేకంగా కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో వివాదం తీవ్రమైంది. తన భార్యకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వారు జేసీ బ్రదర్స్  అనుచరులన్న అనుమానంతో ఆయన తన అనుచరవర్గంతో కలిసి ఏకంగా జేసీ దివాకర్ రెడ్డి నివాసానికి వెళ్ళారు. జేసీ అనుచరులపై ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఫాలోవర్స్ దాడికి దిగారు.

ఎమ్మెల్యే పెద్దారెడ్డి భార్యకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో జేసీ వర్గీయులు పోస్టులు పెట్టారు. దాంతో అగ్రహం చెందిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి.. నాలుగు వాహనాలలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి తరలివచ్చారు. ఆయన వెళ్ళినపుడు జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి తమ నివాసంలో లేరు. దాంతో ఇంట్లో వున్న జేసీ అనుచరులపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారు.

జేసీ బ్రదర్స్‌తోపాటు వారి కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో పెద్ద గలాటా తప్పిందని తాడిపత్రిలో చెప్పుకుంటున్నారు. జేసీ నివాసంలో పని చేసే వారితోపాటు.. జేసీ సోదరుల అనుచరులపై ఎమ్మెల్యే వర్గీయులు దాడి చేశారని సమాచారం. అసలే ఉప్పు, నిప్పులా వున్న జేసీ, పెద్దారెడ్డి వర్గీయుల మధ్య తాజా పరిణామాలు ఎటు దారి తీస్తాయోనని తాడిపత్రి వాసులు భయాందోళనకు గురవుతున్నారు.

ఇదీ చదవండి: ఫెలో షిప్పుల మంజూరులో అక్రమాలు.. ఓయూ, కేయూలపై హైకోర్టులో పిల్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu