టీడీపీ అధినేత చంద్రబాబుకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కౌంటర్, వైకుంఠద్వార దర్శనాలను రాజకీయం చేస్తున్నారని విమర్శ
భక్తులపై లాఠీచార్జ్ చేస్తారా అంటూ... చంద్రబాబు చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. వైకుంఠ ద్వార...

భక్తులపై లాఠీచార్జ్ చేస్తారా అంటూ… చంద్రబాబు చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. వైకుంఠ ద్వార దర్శనాలను కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇంకా వైకుంఠ ద్వార దర్శనాలే ప్రారంభం కాలేదన్నారు. భక్తులపై ఎక్కడా, ఎలాంటి లాఠీచార్జ్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు వైవీ సుబ్బారెడ్డి. శ్రీవారి విషయంలోనైనా రాజకీయాలు మానుకోవాలని చంద్రబాబుకు సూచించారు టీటీడీ చైర్మన్. దర్శనం విషయంలో తాము ముందు నుంచి భక్తులకు సమాచారం అందిస్తూనే ఉన్నామని.. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకొన్న వారికే దర్శనం కల్పిస్తామని.. లేని వారికి అనుమతి ఉండబోదని గతంలోనే చెప్పినట్టు సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఏ మాత్రం అవకాశం ఉన్నా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి దర్శనం కల్పించే ప్రయత్నం చేస్తామని.. కాకపోతే ఒకరికి అనుమతి ఇస్తే.. ఎక్కువ మంది ఆశిస్తారని.. అందుకే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారికే ప్రాధాన్యమిస్తున్నామన్నారాయన.
అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట మంటగలిపేలా వ్యవహరిస్తోంది. స్వామి వారి దర్శనం కోసం దూర ప్రాంతాల నుండి వచ్చిన సామాన్య భక్తులను కొండపైకి అనుమతించకపోగా లాఠీఛార్జి చేయడం హేయం.(1/3) pic.twitter.com/0uHFf5MCIN
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) December 23, 2020