విరాట్‌ కోహ్లీకి ఒక రూలు, మిగతా ఆటగాళ్లకు ఒక రూలా? టీమిండియా మేనేజ్‌మెంట్‌ పక్షపాత ధోరణిపై తీవ్ర విమర్శలు చేసిన గవాస్కర్‌.

టీమిండియా మేనేజ్‌మెంట్‌తో గవాస్కర్‌ చెడుగుడు ఆడుకున్నాడు. ఆటగాళ్ల విషయంలో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆరోపించాడు. నిబంధనలు అందరికి ఒకేలా ఎందుకు లేవని ప్రశ్నించాడు.

విరాట్‌ కోహ్లీకి ఒక రూలు, మిగతా ఆటగాళ్లకు ఒక రూలా? టీమిండియా మేనేజ్‌మెంట్‌ పక్షపాత ధోరణిపై తీవ్ర విమర్శలు చేసిన గవాస్కర్‌.
Follow us

|

Updated on: Dec 24, 2020 | 1:52 PM

టీమిండియా మేనేజ్‌మెంట్‌తో గవాస్కర్‌ చెడుగుడు ఆడుకున్నాడు. ఆటగాళ్ల విషయంలో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆరోపించాడు. నిబంధనలు అందరికి ఒకేలా ఎందుకు లేవని ప్రశ్నించాడు. పెటర్నిటీ లీవ్‌ విరాట్‌ కోహ్లీకి ఇచ్చినప్పుడు నటరాజన్‌కు ఎందుకు ఇవ్వడం లేదని గట్టిగానే నిలదీశాడు. కోహ్లీకి మాత్రమే పెటర్నిటీ లీవ్‌లు తీసుకునే హక్కు ఉంటుందా? టీమిండియాలో కొత్తగా చోటు దక్కించుకున్న యార్కర్‌ స్పెషలిస్టు నటరాజన్‌కు పితృత్వ సెలవులు తీసుకునే హక్కు లేదా అని ప్రశ్నించాడు లిటిల్‌మాస్టర్‌ గవాస్కర్‌. కొత్తగా వచ్చినవాడని చిన్నచూపు చూడటం తగదంటూ పేర్కొన్నాడు. ఆసీస్‌తో జరిగిన టీ-20 సిరీస్‌లో ఆరు వికెట్లు తీసుకుని అబ్బురపరచిన నటరాజన్‌ విషయంలో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ పక్షపాతం వహిస్తున్నదని విమర్శించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న నటరాజన్‌ ఈమధ్యనే తండ్రి అయ్యాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ టోర్నమెంట్‌ టైమ్‌లోనే నటరాజన్‌ భార్య బిడ్డను ప్రసవించారు. ఇప్పటి వరకు నటరాజన్‌ తన బిడ్డను చూసుకోలేదు.. కారణంగా ఐపీఎల్‌ టోర్నమెంట్‌ ముగిసిన తర్వాత యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ నుంచి నేరుగా ఆస్ట్రేలియాకు వెళ్లాల్సి రావడం.. లిమిటెడ్‌ ఓవర్ల టోర్నమెంట్లు ముగిసినా నటరాజన్‌ను స్వదేశానికి పంపడం లేదు.. అలాగని టెస్ట్‌ టీమ్‌లో నటరాజన్‌కు చోటిచ్చారా అంటే అదీ లేదు.. నెట్‌ బౌలర్‌గా నటరాజన్‌ను అక్కడే పెట్టుకున్నారు. పుట్టిన బిడ్డను మొదటిసారి చూసుకునేందుకు జనవరి మూడో వారం వరకు నటరాజన్‌ ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంటే, కోహ్లీ మాత్రం తనకు పుట్టబోయే బిడ్డను చూసుకునేందుకు ఇండియాకు తిరిగి వస్తున్నాడు. గవాస్కర్‌ అభ్యంతరం చెబుతున్నది విషయంలోనే! కోహ్లీకి ఒక రూల్‌, మిగతా ఆటగాళ్లకు మరో రూల్‌ ఉండటం సరికాదంటున్నాడు గవాస్కర్‌. అలాగే రవిచంద్రన్‌ అశ్విన్‌పై కూడా టీమ్‌ మేనేజ్‌మెంట్‌ పక్షపాతం చూపిస్తున్నదని ఆరోపించారు.. టీమ్‌లో తన స్థానం కోసం అతడు ఎప్పుడూ పోరాడవలసి వస్తున్నదని చెప్పాడు. 350 వికెట్లు, నాలుగు సెంచరీలు చేసిన అశ్విన్‌కు ఫైనల్‌ లెవెన్‌లో చోటు ఉంటుందో ఉండదో లాస్ట్‌ మినిట్‌ వరకు తెలియడం లేదని గవాస్కర్‌ విమర్శించాడు. ఫామ్‌లో లేడన్న కారణంగా టీమ్‌లో చోటివ్వకపోవడం కరెక్టే కానీ మంచి ఫామ్‌లో ఉన్న అశ్విన్‌తో ఇలా వ్యవహరించడం తగదని గవాస్కర్‌ సూచించాడు. దీనివల్ల అశ్విన్‌ కాన్ఫిడెన్స్‌ దెబ్బతింటుందని చెప్పాడు. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ తన వ్యవహారశైలి మార్చుకుంటే మంచిదని సూచించాడు గవాస్కర్‌.

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..