Nandyala: పొద్దున్నే పూజ చేసేందుకు శివాలయానికి వెళ్లిన పూజారి షాక్.. తలుపు ఓపెన్ చేయగానే..
ఎండాకాలం అండీ బాబు. పాములు ఎక్కువగానే జనావాసాల్లోకి వచ్చే ప్రమాదం ఉంది. పొలాలకు సమీపంగా నివశించేవారు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగని కనపడగానే సర్పాలను చంపకండి.

నంద్యాల జిల్లాలోని ఓ శివాలయంలో నాగుపాము హల్‌చల్ చేసింది. డోన్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న శివాలయంలో నిన్న రాత్రి నాగుపాము చొరబడింది. ఉదయాన్నే పూజలు నిర్వహించేందుకు వెళ్లిన పూజారి ఆలయంలో బుసలు కొడుతూ కనిపించిన నాగుపామును చూసి షాకయ్యారు. వెంటనే స్థానిక స్నేక్ క్యాచర్‌కు సమాచారమిచ్చారు. ఆలయం వద్దకు చేరుకున్న స్నేక్ క్యారర్ 8 అడుగుల పొడవున్న ఆ నాగుపామును పట్టుకొని ఊరి చివర అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు.
ప్రజంట్ సమ్మర్ సీజన్ నడుస్తున్న విషయం తెలసిందే. వేసవి తాపంతో, దాహం వేసి విష సర్పాలు, వన్యప్రాణాలు జనావాసాల్లోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అప్రమత్తత అవసరం. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలకు సమీపంగా నివశించేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. అలాగని కనపడగానే వాటిని చంపేయకూదు. వన్యప్రాణులు కనిపిస్తే.. అటవీ శాఖ సిబ్బంది.. పాములు కనిపిస్తే.. స్నేక్ క్యాచర్స్‌కి సమాచారం ఇవ్వాలి. ఇది సృష్టి అనేది అన్ని జీవుల కోసం. కేవలం మనుషులు సొత్తేం కాదు అని గుర్తుపెట్టుకోవాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..