Narasaraopet: తేడాగా కనిపించిన చిత్తు కాగితాలు ఏరుకునే వ్యక్తి.. పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా
పోలీసులు సిసి కెమెరా విజువల్స్ ను పరిశీలించారు. అంకమరావు హత్యలు చేసినట్లు భావించి అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో అతని చెప్పిన విషయాలకు పోలీసులే ఆశ్చర్య పోయారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి...

చిత్తు కాగితాలు ఏరుకుంటూ ఉంటాడు. పగలే కాదు రాత్రులు కూడా సంచి తగింలించుకొని తిరుగుతూ ఉంటాడు. పేవ్ మెంట్స్, షాపుల ముందు నిద్రించే వాళ్ళను టార్గెట్ చేసుకుంటాడు. బండరాళ్ళతో కొట్టి చంపుతాడు. వాళ్ళ దగ్గరున్న వందో యాభై తీసుకొని పారిపోతాడు. ఇప్పటివరకూ నాలుగు మర్డర్లు చేశాడు. ఎట్టకేలకు పల్నాడు పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.
నర్సరావుపేట బిసి కాలనికి చెందిన అంకమరావు పట్టణంలో చిత్తు కాగితాలు ఏరుకుంటూ తిరుగుతుంటాడు. తండ్రి లేకపోవటంతో జులాయిగా తిరుగుతుంటాడు. తనకు కావాల్సిన డబ్బులు కోసం ఆరు బయట నిద్రిస్తున్న వారిపై దాడి చేసి డబ్బులు తీసుకొని పారిపోతంటాడు. ఈ నెల పదో తేదీన స్టేషన్ రోడ్డులో జరిగిన జంట హత్యలతో పట్టణంలో కలకలం రేగింది. వరంగల్ కు చెందిన సంపత్ రెడ్డిని అదేవిధంగా మరో వ్యక్తిని రాళ్ళతో కొట్టి చంపారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సిసి కెమెరా విజువల్స్ ను పరిశీలించారు. అంకమరావు హత్యలు చేసినట్లు భావించి అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో అతని చెప్పిన విషయాలకు పోలీసులే ఆశ్చర్య పోయారు. 2022 లో కూడా ఒక వృద్దురాలిపై దాడి చేసి లక్షా డెబ్బై ఐదు వేలు ఎత్తుకెళ్ళాడు. చికిత్స పొందుతూ వృద్దురాలు చనిపోయింది. ఈ కేసులో అంకమరావును పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే సరైన ఆధారాలు లభించకపోవటంతో కోర్టు అతన్ని వదిలేసింది. ఈ నెల ఐదో తేదిన ఆరు బయట నిద్ర పోతున్న యాచకురాలిని చంపి ఆమె వద్ద ఉన్న 400 రూపాయలు తీసుకెళ్ళాడు. ఈ నెల పదో తేదీన స్టేషన్ రోడ్డులో ఇద్దరిపై దాడి చేసి చంపేశాడు. వారి వద్ద నున్న 30, 120 రూపాయలు తీసుకున్నాడు. రంగంలోకి దిగిన పోలీసులు సిసి కెమెరాల విజువల్స్ సాయంతో అంకమ్మ రావే హత్య చేసినట్లు నిర్థారించుకొని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది.
“అంకమరావును అరెస్ట్ చేశాం. 2003 నుండి 2019 వరకూ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ పోలీసులు చిక్కి జైలు నుండి బయటకు వచ్చేవాడు. 2022 లో మాత్రం ఒక వృద్దురాలిని హత్య చేశాడు. ఈ నెలలో మూడు హత్యలు చేశాడు. సాంకేతికతను ఉపయోగించి అన్ని ఆధారాలు సేకరించి అరెస్టు చేశాం” అని పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..