AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: వేర్ ఈజ్ శ్రీధర్ వర్మ.. ఇంతకీ పార్సిల్‌లో వచ్చిన ఆ డెడ్ బాడీ ఎవరిది..?

రెండు రోజుల క్రితం పార్సిల్‌లో డెడ్‌బాడీ అన్నది తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఉండి పోలీసులకు చాలెంజింగ్‌ మారింది. డెడ్‌బాడీ ఎవరిది? ఎవరు పంపారు? వేర్ ఈజ్ శ్రీధర్ ఈ ప్రశ్నల చుట్టూ పోలీసుల దర్యాప్తు సాగుతోంది.

Andhra News: వేర్ ఈజ్ శ్రీధర్ వర్మ.. ఇంతకీ పార్సిల్‌లో వచ్చిన ఆ డెడ్ బాడీ ఎవరిది..?
Crime News
Shaik Madar Saheb
|

Updated on: Dec 22, 2024 | 11:11 AM

Share

రెండు రోజుల క్రితం పార్సిల్‌లో వచ్చిన డెడ్‌బాడీ ఎవరిది అన్నది తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.. ఈ కేసును సవాల్ గా తీసుకున్న పోలీసులు.. దర్యాప్తును ముమ్మరం చేశారు.. అయితే.. అసలేం జరిగింది? ఎవరి శ్రీధర్ వర్మ? రెండు రోజుల పోలీసుల విచారణలో ఎలాంటి పురోగతి ఉందనే విషయంలోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యెండగండిలో డెడ్‌బాడీ పార్సిల్ కేసులో నిందితుడు శ్రీధర్ వర్మ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇంటి నిర్మాణం కోసం దాతలసాయం కోరింది తులసి. అయితే ఆమె ఇంటికి సామాగ్రి పేరుతో డెడ్‌బాడీ పార్సిల్ వచ్చింది. ఈ విషయాన్ని తులసి చెల్లెలు రేవతి భర్త, మరిది శ్రీధర్ వర్మకు చెప్పింది. ఏం చేయాలని ఆలోచించిన శ్రీధర్ వర్మ డెడ్‌బాడీని మాయం చేద్దామని మామ రంగరాజుకు చెప్పాడు. అయితే తులసి మాత్రం డెడ్‌బాడీ సమాచారాన్ని పోలీసులకు అందించింది. విషయం పోలీసులకు తెలియడంతో శ్రీధర్ వర్మ ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు.

మరో ఆసక్తికర విషయం ఏంటంటే డెడ్‌బాడీతో పాటు పార్సిల్‌లో ఓ లేఖ లభ్యమైంది. తాను గతంలో ఇచ్చిన మూడు లక్షల రూపాయల బాకీని వడ్డీతో చెల్లించాలన్నది లేఖ సారాంశం. బాకీ వడ్డీతో కోటి 30 లక్షల రూపాయలు అయ్యింది.. అది ఇవ్వకపోతే ఇబ్బందులు పడతారంటూ ఆ లెటర్‌లో రాసి ఉంది. ఈ లేఖ శ్రీధర్ వర్మ చేతిరాతతో పోలి ఉండటంతో అనేక అనుమానాలకు దారితీస్తోంది. దీంతో పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.

ఈడెడ్ బాడీ ఎవరిది? ఎక్కడి నుంచి తెచ్చారు, పార్సిల్ ఎవరు పంపించారు అనేది పెద్ద మిస్టరీగా మారింది. శ్రీధర్ వర్మను అదుపులోకి తీసుకుంటే అన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందంటున్నారు పోలీసులు. శ్రీధర్ వర్మ సిమ్‌ కార్డుతో పాటు ఫోన్లను సైతం మారుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..