AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: హాస్టల్‌‌లో విద్యార్థిని కోసం గాలింపు.. పైఅంతస్థుకి వెళ్లే చూసేసరికి గుండె గుభేల్..!

సంక్షేమ హాస్టల్లోనే విద్యార్ధిని ప్రసావించారు. దీంతో జిల్లా కలెక్టర్ వార్డెన్‌ను సస్పెండ్ చేశారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. పరివర్తన పేరుతో ప్రభుత్వం సంక్షేమ హాస్టల్‌ను నడుపుతోంది. ఆ హస్టల్‌ పైఅంతస్థులో రెండు రోజుల క్రితం ఒక విద్యార్ధిని తీవ్ర రక్తస్రావంతో పడిపోయింది. ఆ పక్కనే శిశువు పడి ఉంది.

Andhra Pradesh: హాస్టల్‌‌లో విద్యార్థిని కోసం గాలింపు.. పైఅంతస్థుకి వెళ్లే చూసేసరికి గుండె గుభేల్..!
A Student Who Gave Birth In A Welfare Hostel In Prakasam
T Nagaraju
| Edited By: Velpula Bharath Rao|

Updated on: Dec 22, 2024 | 12:36 PM

Share

జిల్లా కలెక్టర్.. ఎస్పీతో పాటు ఇతర ఉన్నతాధికారులు ఉండే అత్యంత్య సురక్షిత ప్రాంతం అది. అక్కడ పరివర్తన పేరుతో ప్రభుత్వం సంక్షేమ హాస్టల్‌ను నడుపుతోంది. ఆ హస్టల్‌ పైఅంతస్థులో రెండు రోజుల క్రితం ఒక విద్యార్ధిని తీవ్ర రక్తస్రావంతో పడిపోయింది. ఆ పక్కనే శిశువు పడి ఉంది. ఆ విద్యార్ధిని కోసం గాలిస్తూ తోటి స్నేహితులపై అంతస్థుకి వెళ్లే సరికి అక్కడి పరిస్థితి చూసి ఖంగుతిన్నారు. తోటి విద్యార్ధినికి డెలివరీ అయినట్లు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని హస్టల్ వార్డెన్‌కు చెప్పారు.

పైఅంతస్థుకు చేరుకున్న హాస్టల్ వార్డెన్ వెంటనే ఈ విద్యార్ధిని ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత పూర్తి విచారణ చేపట్టారు. ప్రకాశం జిల్లా దర్శి మండలానికి చెందిన 18 ఏండ్ల యువతి హాస్టల్‌లో ఉంటూ బీఫార్మసీ సెకండ్ ఇయర్ చదువుతోంది. గుంటూరు సమీపంలోని కాలేజ్‌కి ప్రతి రోజూ వెళ్లి వస్తుంటుంది. ఈ యువతికి అదే గ్రామానికి చెంది వరుసకు బావ అయిన యువకుడితో ప్రేమ వ్యవహారం ఉంది. గత ఏడేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆ యువకుడు పెళ్లి చేసుకుంటానని ప్రమాణం కూడా చేశాడు. ఈ క్రమంలోనే కొద్దీ రోజుల క్రితం సెలవులకని ఇంటికి వెళ్లిన యువతి.. ఆ యువకుడితో శారీరకంగా కలిసింది. ఆ తర్వాతే ఆమె గర్బం దాల్చింది. అయితే ఈ విషయం ఎవరికి చెప్పకుండా హాస్టల్‌కు వచ్చి ఎప్పటిలాగే కాలేజ్‌కు వెళ్తుంది. కొద్దీ రోజుల క్రితం హాస్టల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంది. అయితే రెండు రోజుల క్రితం అధిక రక్త స్రావం కావడంతో పై అంతస్థుకి వెళ్లిపోయింది. అక్కడే డెలివరీ అయినట్లు ఆ యువతి విచారణలో భాగంగా చెప్పింది.

వెంటనే ఈ విషయాన్ని విద్యార్ధిని తల్లిదండ్రులకు చెప్పి వారిని ఆసుపత్రికి పిలిపించారు. అయితే ఆసుపత్రిలో ఉన్న తమ బిడ్డను చూసుకొని తల్లిదండ్రులు బోరున విలపించారు. ఆ యువకుడి పేరు తెలుసుకొని అతనితో పెళ్లి చేసేందుకు పెద్ద మనుషులతో మాట్లాడారు. అయితే పోలీసులు మాత్రం కేసు నమోదు చేశారు. మరో వైపు హాస్టల్ వార్డెన్‌ను కలెక్టర్ సస్పెండ్ చేశారు. విద్యార్ధిని గర్భం దాల్చిన కనుక్కోలేకపోవడంపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలంటూ ఆదేశించారు. ఈ ఘటన కలకలం రేపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి