AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan : సినీ పరిశ్రమ ఏపీకి రావాలని కోరుకుంటున్నా.. పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. సినీ ఇండస్ట్రీ ఆంధ్రకు రావాలని కోరుకుంటున్నానని అన్నారు. విదేశాల్లో కాకుండా ఇక్కడే షూటింగ్స్ చేస్తే ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.

Pawan Kalyan : సినీ పరిశ్రమ ఏపీకి రావాలని కోరుకుంటున్నా.. పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Pawan Kalyan
Rajitha Chanti
|

Updated on: Dec 22, 2024 | 1:35 PM

Share

సినీ ఇండస్ట్రీపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌‌ ఇంట్రస్టింగ్ కామెంట్స్‌ చేశారు. అల్లూరి జిల్లాలో పర్యటించిన ఆయన.. సినీ పరిశ్రమ ఇక్కడకు రావాలని కోరుకుంటున్నానన్నారు. సినిమా షూటింగ్‌లకు అందరూ విదేశాలకు పోతున్నారని.. అలా వెళ్లకుండా ఇక్కడే షూటింగ్‌లు చేస్తే ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అన్ని విధాలా ఆలోచించే టూరిజం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు పవన్‌కళ్యాణ్..

సినీ పరిశ్రమ ఏపీకి వస్తే స్వాగతిస్తా: టీడీపీ ఏపీ అధ్యక్షుడు

మరోవైపు.. సినీ పరిశ్రమ ఏపీకి వస్తే స్వాగతిస్తామని చెప్పారు టీడీపీ ఏపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్‌. సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుందని పవన్‌కళ్యాణ్‌ కూడా ప్రకటించారన్నారు. ఏపీలో ఎన్నో అందమైన షూటింగ్ స్పాట్స్ ఉన్నాయన్నారు పల్లా శ్రీనివాస్. సంధ్య థియేటర్ ఘటనపై పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ..”తొక్కిసలాటలో ఇంటెలిజెన్స్ వైఫల్యం కనిపిస్తోంది. ఇంటెలిజెన్స్ విభాగం పరిస్థితిని ముందే అంచనా వేయాలి. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలి. ఫిల్మ్ స్టార్స్‌ సైతం పరిస్థితిని అంచనా వేయగలగాలి అని సూచిస్తున్నారు. ఆ సమయంలో అల్లు అర్జున్ అక్కడికి వెళ్లాల్సింది కాదని అన్నారు. ప్రజల ప్రాణాలకు హానీ కల్గకుండా చూడాలి. బాధిత కుటుంబానికి అండగా ఉండి ఆదుకోవాలి” అని అన్నారు.

సినిమా టికెట్ల రేట్లు పెంచబోమని, బెనిఫిట్ షోలను అనుమతించబోమని ప్రకటించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభినందించారు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మాదిరిగానే ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఇదే ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు రామకృష్ణ.

ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‏బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..

Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‏గా..

Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‏ను మించిన అందం.. ఎవరంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.