Andhra News: క్లాస్‌రూమ్‌లో ఉండగానే టీచర్‌ కిడ్నాప్‌.. ఏపీలో కలకలం

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో టీచర్‌ కిడ్నాప్‌ కలకలం రేపింది. క్లాస్‌రూమ్‌లో ఉండగానే టీచర్‌ను దుండగులు ఎత్తుకెళ్లిన ఘటన సంచలనంగా మారింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటన ఏపీలో కలకలం రేపింది.

Andhra News: క్లాస్‌రూమ్‌లో ఉండగానే టీచర్‌ కిడ్నాప్‌.. ఏపీలో కలకలం
Teacher Kidnap
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 22, 2024 | 9:36 AM

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం అల్లుగుండు ప్రభుత్వ పాఠశాలలో టీచర్ మునీర్ అహ్మద్ కిడ్నాప్ అయ్యారు. క్లాస్‌రూమ్‌లో ఉండగానే దుండగులు కిడ్నాప్ చేయడం కలకలం రేపుతోంది. ఉదయం 10 గంటల నుంచి ఆచూకీ లేకపోవడంతో కుటుంబసభ్యుల ఆందోళనకు గురయ్యారు. పోలీసులే కిడ్నాప్ చేసారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మునీర్ అహ్మద్ కిడ్నాప్ కావడం ఇది మూడవసారి అని కుటుంబ సభ్యులు అంటున్నారు.

కర్నూలు సెంట్రల్ స్కూల్ వెనుక 20 కోట్ల రూపాయల విలువ చేసే భూవివాదంలో కిడ్నాప్ చేశారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. భూవివాదంపై మునీర్ అహ్మద్ ఫిర్యాదుదారుగా ఉన్నారు. భూమిపై హైకోర్టులో విచారణ కొనసాగుతోందని.. వెల్దుర్తి పీఎస్‌లో బాధితుని భార్య ఫిర్యాదు చేశారు.

వీడియో చూడండి..

మునీర్ అహ్మద్ సోదరుడు, రిటైర్డ్ ఎస్బీఐ అధికారి మక్బూల్ బాషా కూడా కనిపించడం లేదని కుటుంబ సభ్యులు అంటున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..