SBI ATM Robbery: ఏటీఎం దొంగతనం ప్రొఫెషనల్స్ పనే.. నిందితుల కోసం పోలీసులు గాలింపు
SBI ATM Robbery: కర్నూలు జిల్లా డోన్ లో అత్యంత సంచలనం సృష్టించిన ఏటీఎం చోరీ సంఘటన కొలిక్కి వస్తోంది. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం నాలుగు ప్రత్యేక టీమ్లు గాలిస్తున్నాయి..
SBI ATM Robbery: కర్నూలు జిల్లా డోన్ లో అత్యంత సంచలనం సృష్టించిన ఏటీఎం చోరీ సంఘటన కొలిక్కి వస్తోంది. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం నాలుగు ప్రత్యేక టీమ్లు గాలిస్తున్నాయి. జరిగిన సంఘటనను, వేలిముద్రలు, డాగ్ స్క్వాడ్ ఇతరత్రా వాటిని అంచనా వేసిన పోలీసులు ప్రొఫెషనల్స్ గా గుర్తించారు. గతంలో ఎవరెవరు ఏటీఎంల చోరీకి పాల్పడ్డారు అనే వాటి లిస్టు తీసుకున్నారు. డోన్ ఎస్బిఐ ఎటిఎం లో 65 లక్షలకు పైగా నగదు చోరీ చేసిన సంగతి తెలిసిందే. డోన్ ఏటీఎం కంటే ముందుగా కర్నూలు నగరంలో కొన్ని ఏటీఎంల పై అటెంప్ట్ చేసినట్టు సీసీ కెమెరా విజువల్స్ ని బట్టి స్పష్టమవుతోంది. అయితే కర్నూలులో కుదరకపోవడంతో కర్నూల్ నుంచి డోన్ కు కారులో కేవలం 30 నిమిషాల్లోనే చేరుకున్నట్లు సీసీ కెమెరాలను బట్టి స్పష్టమవుతోంది.
ఎస్ పి సుధీర్ కుమార్ రెడ్డి ఇప్పటికే ఏటీఎం దొంగల ఆచూకీ కోసం నాలుగు బృందాలను పంపించారు. ముందుగా సీసీ కెమెరాలు ధ్వంసం చేయడం చోరీకి గ్యాస్ కట్టర్ ఉపయోగించడంతో…
అలాంటి నేరాలకు పాల్పడే వారి జాబితా సేకరించగా… అందులో ఉన్నవారే డోన్ ఏటీఎం చోరీకి పాల్పడినట్లు గా స్పష్టమవుతోంది. సాధ్యమైనంత త్వరగా నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Reporter : Nagireddy Kurnool
Also Read: ఇవాళ్టికి ముగిసిన విచారణ.. పూరీ బ్యాంకు లావాదేవీలపై ఈడీ ఫోకస్.. అసలేం జరిగిందంటే..