Tollywood Drug Case: ఇవాళ్టికి ముగిసిన విచారణ.. పూరీ బ్యాంకు లావాదేవీలపై ఈడీ ఫోకస్.. అసలేం జరిగిందంటే..
Tollywood Drug Case: టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో డైరెక్టర్ పూరి జగన్నాథ్ విచారణ ఈరోజుకు పూర్తయ్యింది. సుమారు 10 గంటలకు పైగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ..
Tollywood Drug Case: టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో డైరెక్టర్ పూరి జగన్నాథ్ విచారణ ఈరోజుకు పూర్తయ్యింది. సుమారు 10 గంటలకు పైగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు పూరి జగన్నాథ్ ను ప్రశ్నించారు . మనీ ల్యాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘన పై పూరి జగన్నాధ్ ను ఈడీ అధికారులు ప్రశ్నించారినట్లు తెలుస్తోంది. ఈడీ కార్యాలయంలో పూరి విచారణ ఉదయం 10.17నుంచి రాత్రి 7.45 గంటల వరకు విచారణ కొనసాగింది. పూరీని మరోసారి విచారణకు పిలిచే అవకాశం వుంది.
కాగా, టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్ ఈడీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. పూరీ విచారణ జరుగుతున్న సమయంలోనే బండ్ల గణేష్ అక్కడి రావడంతో మరింత సంచలనం రేపుతోంది. అయితే తాను పూరి జగన్నాథ్ కోసం వచ్చానని.. తనకు ఎవరూ నోటీసులు ఇవ్వలేదని ఆయన చెబుతున్నారు. అసలు తనకెందుకు నోటీసులు ఇస్తారని బండ్ల గణేశ్ ప్రశ్నించారు.
కాగా గతంలో అరెస్ట్ అయిన నిందితుల స్టేట్ మెంట్ ఆధారంగా పూరి జగన్నాధ్ ను ప్రశ్నించారు. పూరీ కి అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాల తో ఉన్న సంబంధాల పై ఈడీ ఆరా తీశారు.. విదేశాల నుండి డ్రగ్స్ కొనుగోళ్లు ఏ రూపంలో ఆర్థిక లావాదేవీలు జరిగాయన్న అంశాల పై వివరాలు ఈడీ అధికారులు సేకరించారు. పూరీ జగన్నాధ్ కు సంబంధించి మూడు బ్యాంక్ ఎకౌంట్ల ను పరీశీలించారు. పూరి జగన్నాధ్ కు సంబంధించిన వైష్ణో బ్యానర్, పూరి కనెక్ట్స్ బ్యానర్ ఆడిట్ రీపోర్ట్ లను పరీశీలించారు. పూరి జగన్నాధ్ అడిట్ రీపోర్ట్ వివరాలు సేకరించారు. పూరి జగన్నాధ్ ఆర్ధిక లావాదేవీల పై కూపీ లాగినట్లు సమాచారం. పూరి జగన్నాధ్ స్టేట్ మెంట్ లిఖిత పూర్వకంగా ఎనిమిది పేజీల స్టేట్మెంట్ రికార్డ్ చేసిన ఈడీ అధికారులు తదుపరి విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరుకావాలని ఆదేశం ఇచ్చారు. దీంతో తాను విచారణకు సహకరిస్తానని.. కచ్చితంగా హాజరవుతామని పూరి జగనాథ్మీ హామీనిచ్చినట్లు సమాచారం.. కాగా పూరి జగన్నాధ్ ను Pmla యాక్ట్ సెక్షన్ 3.4 ప్రకారం ఈడీ అధికారులు విచారించారు.
పూరి జగన్నాథ్ విచారణ లో కీలక విషయాలు
పూరి జగన్నాథ్ ని ఆఫ్రికన్ దేశానికి సంబంధించిన ముగ్గురు ఫోటోలు చూపెట్టిన ఈడి అధికారులు.. వారు పూరికి తెలుసా అని అడిగిన అధికారులు దీంతో తనకు వారు ఎవరో తెలియదని పూరి సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. ఆఫ్రికా కంట్రీకి సంబంధించిన రెండు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ పై అధికారులు విచారణ చేయగా.. తాను సినిమా షూటింగ్ నిమిత్తం ఆ లావాదేవీలు జరిపినట్టు గా పూరి జగన్నాథ్ సమాధానమిచ్చారు. దీంతో ఈ బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి పూర్తి వివరాలను ఇవ్వాలని ఈడీ అధికారులు కోరారు. దీంతో తాను రెండు లావాదేవీలకు సంబంధించి పూర్తి వివరాలు ఇస్తానని పూరి జగన్నాథ్ చెప్పినట్లు తెలుస్తోంది.
Also Read: